ప్రపంచంలో అత్యంత ట్రాఫిక్(Traffic) ఉండే నగరాల్లో సిలికాన్ వ్యాలీ ఆఫ్‌ ఇండియా బెంగళూరుకు(Silicon Valley of India bangalore) ఆరో స్థానంలో నిలిచింది. టెక్నాలజీ నిపుణుడు టామ్‌టామ్‌ 2023 సంవత్సరానికి ఈ నివేదికను విడుదల చేశారు.

ప్రపంచంలో అత్యంత ట్రాఫిక్(Traffic) ఉండే నగరాల్లో సిలికాన్ వ్యాలీ ఆఫ్‌ ఇండియా బెంగళూరుకు(Silicon Valley of India bangalore) ఆరో స్థానంలో నిలిచింది. టెక్నాలజీ నిపుణుడు టామ్‌టామ్‌ 2023 సంవత్సరానికి ఈ నివేదికను విడుదల చేశారు. అయితే 2022తో పోలిస్తే బెంగళూరు కాస్త మెరుగుపడింది. 2022లో బెంగళూరుకు రెండో స్థానంలో ఉండగా.. అది ఇప్పుడు ఆరో స్థానానికి చేరింది. 2022లో బెంగళూరులో 10 కి.మీ. ప్రయాణానికి సగటున 29 నిమిషాల సమయం పడితే.. 2023లో 28.10 నిమిషాల సమయం పడుతోంది.

2023లో బెంగళూరులో రద్దీ సమయాల్లో వాహనాల సగటు వేగం గంటకు 18 కి.మీ. అయితే 2023లో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే నగరంగా లండన్ నిలిచిందని నివేదిక పేర్కొంది. లండన్‌లో సగటు వేగం గంటకు 14 కి.మీ. మాత్రమే. లండన్‌తో పాటు ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో గంటకు 16 కి.మీ. కెనడాలోని టొరంటోలో గంటకు 18 కి.మీ. ఇటలీలోని మిలన్ నగరంలో గంటకు 17 కి.మీ.పెరూలోని లిమాలో గంటకు 17 కి.మీ. ఈ 5 నగరాలు అత్యంత రద్దీ నగరాల జాబితాలో టాప్‌-5లో నిలిచాయి. భారత్‌లోనే మరో నగరం పుణే కూడా ప్రపంచవ్యాప్తంగా అత్యంత రద్దీగా, ట్రాఫిక్‌ అత్యధికంగా ఉండే నగరాల జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. పుణేలో 10 కి.మీ.ప్రయాణానికి 27 నిమిషాల 50 సెకన్ల సమయం పడుతుండగా ఇక్కడ వాహనాల సగటు వేగం గంటకు 19 కి.మీ. పుణే తర్వాత 8వ స్థానంలో బుకారెస్ట్, 9వ స్థానంలో మనీలా, 10వ స్థానంలో బ్రస్సెల్స్ నగరాలున్నాయి.

ఇదే నివేదికలో ఢిల్లీ 44వ స్థానంలో ఉంది. ఢిల్లీలో రద్దీ సమయంలో సగటు వేగం గంటకు 24 కి.మీ. ముంబై 54వ స్థానంలో నిలిచింది. టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్‌ 55 దేశాల్లోని 387 నగరాల్లో సర్వే నిర్వహించగా ఇంధన ఖర్చులు, వాహనాలు వెల్లడించే కాలుష్యంపై కూడా అంచనా వేసింది. అయితే హైదరాబాద్‌పై ఈ నివేదికలో పొందుపర్చలేదు.

Updated On 3 Feb 2024 6:17 AM GMT
Ehatv

Ehatv

Next Story