కర్నాటక(Karnataka)లోని ఓ మహిళా రైతు బుధవారం తన పొలంలో రూ.2.5 లక్షల విలువైన టమోటాలు చోరీకి గురయ్యాయని ఆరోపించింది. కర్ణాటకలోని హాసన్ జిల్లా(Hassan District) బేలూరు(Belur) తాలూకా పరిధిలోని గోని సోమనహళ్లి గ్రామంలోని మహిళా రైతు.. వ్యవసాయ పొలంలో మంగళవారం రాత్రి దొంగలు 50-60 బస్తాల టమాటాలను ఎత్తుకెళ్లారు. మహిళా రైతు ధరిణి, ఆమె కుటుంబ సభ్యులు రెండెకరాల పొలంలో టమాట సాగు చేసి దిగుబడిని వచ్చే వారం మార్కెట్‌కి తరలించాలని యోచిస్తున్నారు.

ధరిణి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. “మేము బీన్ పంటలో చాలా నష్టపోయాము.. టమోటాలు పండించడానికి అప్పులు చేసాము. మాకు మంచి పంట వచ్చింది.. యాదృచ్ఛికంగా ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయి. 50-60 బస్తాల టమోటాలను దొంగలు తీసుకెళ్లడమే కాకుండా.. మిగిలిన పంటను కూడా ధ్వంసం చేశారని ఆమె ఓరుమన్నారు. ధరిణి ఫిర్యాదు మేరకు హళేబీడు పోలీస్ స్టేషన్‌లో దొంగతనం కేసు నమోదైంది.
హళేబీడు పోలీస్ స్టేషన్‌లోని ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ.. “మేము వాణిజ్య పంటల దొంగతనం గురించి విన్నాము.. కానీ టమోటాలు దొంగిలించారని ఎప్పుడూ వినలేదు. మా పోలీస్ స్టేషన్‌లో ఇలాంటి కేసు నమోదు కావడం ఇదే మొదటిసారి అని తెలిపారు.
టమోటా ధరలు రాష్ట్రవ్యాప్తంగా గణనీయమైన పెరిగాయి. బెంగళూరులో కిలో ధర రూ. 101 నుండి 121 మధ్య ధరలు ఉన్నాయి. మార్చి, ఏప్రిల్‌లో అకస్మాత్తుగా ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల.. టమాటా పంటకు తెగుళ్లు సోకడంతో దిగుబడి తగ్గి.. మార్కెట్ ధరలు పెరిగాయి.