నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) టోల్‌ ఛార్జీలను 5 నుంచి 10శాతం మేర పెంచేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. దీనితో జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌ హైవేలపై వెళ్లే ప్రయాణికులపై త్వరలో అదనపు భారం పడే అవకాశాలు ఉన్నాయి . ప్రస్తుత ధరలను సవరిస్తూ తీసుకున్న ఈ టోలు చార్జీలు వచ్చే ఏప్రిల్ 1 వ తేదీ నుండి అమలు కాబోతున్నట్లు సమాచారం . బడ్జెట్ సమావేశాల తర్వాత పెరుగుతున్న ధరల పట్ల ప్రజల్లో తీవ్ర […]

నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) టోల్‌ ఛార్జీలను 5 నుంచి 10శాతం మేర పెంచేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. దీనితో జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌ హైవేలపై వెళ్లే ప్రయాణికులపై త్వరలో అదనపు భారం పడే అవకాశాలు ఉన్నాయి . ప్రస్తుత ధరలను సవరిస్తూ తీసుకున్న ఈ టోలు చార్జీలు వచ్చే ఏప్రిల్ 1 వ తేదీ నుండి అమలు కాబోతున్నట్లు సమాచారం .

బడ్జెట్ సమావేశాల తర్వాత పెరుగుతున్న ధరల పట్ల ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తపరుస్తూ ఉన్నారు. పెట్రోలు ,డీజిల్,ల తో పాటు ఒక్కసారిగా వంట గ్యాస్ ధర భారీగా పెరగటం,వంట నూనెల ధరల పెంపు ఇలా నిత్యా జీవితం తో ముడిపడిన అన్నిటి ధరలు ఆకాశాన్ని చూస్తున్నాయి. ఇప్పుడు ఇదే తరహాలో టోల్ ధరలు కూడా పెరగనున్నాయి . (ఎన్‌హెచ్‌ఏఐ) తీసుకున్న ఈ నిర్ణయం పై వాహనదారులు ఎలా స్పందిస్తారో చూడాలి .

జాతీయ రహదారుల సంస్థ నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం టోల్ ధరల్లో మార్పులు జరుగుతాయి . గతం లో వసూలైన ఫీజు లు ,వినియోగదారుల సంఖ్య ,ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా ఎన్‌హెచ్‌ఏఐ కేంద్ర రోడ్డు, రవాణాశాఖకు ప్రతిపాదనలు పంపగా టోల్ ఫీజు విషయం లో మార్పులు చోటుచేసుకుంటాయి . చివరి నిర్ణయం ప్రభుత్వనిదై ఉంటుంది .దాడుపు 5% నుండి 10% వరకు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . కార్లకు,సొంతవాహనాలకు ,భారీ వాహనాలకు ఏ మేరకు చార్జీలు పెరుగుతాయి అనేదాని పైన ఇంకా స్పష్టత లేనప్పటికీ పెరిగిన ధరలు ఏప్రిల్ నుండి అమలులోకి రానున్నాయి .

Updated On 6 March 2023 3:53 AM GMT
Ehatv

Ehatv

Next Story