విష్ణుమూర్తి దశావతారాలలోని నాలుగో అవతారమే నరసింహస్వామి(narsimha Swamy). శ్రీ లక్ష్మినరసింహ భగవానుడు వైశాఖ మాసంలో శుక్ల చతుర్దశి సంధ్యా సమయంలో ప్రత్యక్షమయ్యాడు. అందుకే నరసింహ జయంతి(Narsimha Jayanthi) వైశాఖ శుక్ల చతుర్ధతి నాడు జరుపుకొంటారు. నరసింహస్వామి రూపంలో దేహం మానవ రూపం, తల సింహం రూపంలో అవతరించిన దేవుడు.నృసింహస్వామి మాహా శక్తి వంతమైన దేవుడు.
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్
నృసింహం భీషణం భద్రం మృత్యోర్ముత్యుర్నమామ్యహమ్
విష్ణుమూర్తి దశావతారాలలోని నాలుగో అవతారమే నరసింహస్వామి(narsimha Swamy). శ్రీ లక్ష్మినరసింహ భగవానుడు వైశాఖ మాసంలో శుక్ల చతుర్దశి సంధ్యా సమయంలో ప్రత్యక్షమయ్యాడు. అందుకే నరసింహ జయంతి(Narsimha Jayanthi) వైశాఖ శుక్ల చతుర్ధతి నాడు జరుపుకొంటారు. నరసింహస్వామి రూపంలో దేహం మానవ రూపం, తల సింహం రూపంలో అవతరించిన దేవుడు.నృసింహస్వామి మాహా శక్తి వంతమైన దేవుడు.
ఈ రోజున విష్ణుమూర్తి హిరణ్యకశిపుడిని సంహరించి, ధర్మాన్ని నిలబెట్టాడు కాబట్టి నరసింహ జయంతిని వేడుకగా జరుపుకొంటారు. స్మార్తులు, మధ్వలు ఇవాళ వేడుకను జరుపుకుంటారు. శ్రీవైష్ణవులు బుధవారం నృసింహ జయంతి పండుగ జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధు పరిరక్షణ కోసం, దుష్టశిక్షణ కోసం ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరించాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతి ముఖ్యమైన పది అవతారాలను దశావతారాలు అంటారు.
ఈ దశావతారాలలో నాలుగవ అవతారము నారసింహావతారము. మహాలక్ష్మిని సంబోధించే శ్రీ పదాన్ని చేర్చి శ్రీనారసింహుడని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు.ఈ శుభదినాన్ని మనమందరం నృసింహజయంతిని ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ రోజున స్వామివారి శాంతి కొరకు పానకం నివేదించడం ఆనవాయితీగా వస్తోంది. మనం భగవంతుడికి పండ్లు, పూలు, దక్షిణ తాంబూలాలను భక్తితో సమర్పించుకోవాలి. మనం ఎంత సమర్పించాము, ఏమి సమర్పించాము అనే లౌకికమైన భావనలకంటే ముఖ్యమైనది మన హృదయాంజలి. మనసా, వాచా, కర్మణా స్వామి