శనైశ్చరుడు ప్రసన్నుడవాలంటే అమావాస్య రోజున కాళీ మాత పూజ చేయాలి. విష్ణువును(Vishnu), కృష్ణుని(Krishna) రూపంలో ధ్యాన్నిస్తూ ‘ఓం నమో నారాయణాయ’, ‘హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే..’ అని జపించాలి. హనుమంతుడిని(Hanuman) సర్వోత్కృష్టమైన (అనంతమైన) రూపంలో ధ్యానించాలి. శని, హనుమంతుని వీపుపై చేరి అతన్ని పట్టి పీడించాలని ప్రయత్నించినప్పుడు, తన బలం అంతా ఉపయోగించి, ఒక్క విదిలింపుతో శనిని, విసిరి పారేసినప్పుడు సూర్య భగవానుడు, హనుమంతుడిని మెచ్చుకుని, “నిన్ను పూజించిన వారికి శని బాధలుండవు” అని దీవించాడట.

శనిత్రయోదశి, శనిజయంతి (పుష్యమాసం, బహుళ అష్ఠమి) మరియు శనిఅమావస్య రోజులలో తిలాభిషేకం చేయాలి. బ్రాహ్మణునికి నల్ల నువ్వులు దానం చేయాలి. నల్ల గోవు(Cow)(కపిల గోవు)కు బెల్లం మరియు నువ్వుల మిశ్రమాన్ని తినిపించాలి. శనివారాలలో (శ్రావణ మాసంలో తప్పనిసరిగా) ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉపవాసం ఉండాలి.

కాకులకు(Crow) ఉదయం, మధ్యాహ్న సమయంలో అన్నం పెట్టాలి. వికలాంగులకు ఆహారం అందివ్వాలి. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి. శని క్షేత్రాలు సందర్శించాలి. ప్రతిరోజూ సూర్యాస్తమయం తరువాత ఇంటి ముఖద్వారం వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి. దశరథ మహారాజ కృత శని స్తోత్రమును పఠించాలి. శ్రావణ పూర్ణిమ నాడు, జ్యేష్టాదేవికి, శనీశ్వరుడికి కల్యాణం జరిపించాలి.

మూలమంత్రం, పునర్చరణ, హవనం, దానములతో పాటుగా 19 వేల సార్లు శనిజపం చేయడం మంచిది. శ్రావణమాసలో, శనివారాలలో శనైశ్వరవ్రతం, హోమం చేయటం చాలా మంచిది. శనైశ్వర దీక్ష, శ్రావణ శుద్ధ విదియ నుంచి శ్రావణ బహుళ షష్ఠి వరకు పూనాలి.‘రామ నామం’, హనుమాన్ చాలీసా, దుర్గా స్తుతులను జపించడం. హనుమంతుడు, శ్రీ దుర్గా దేవి, వినాయకులను ప్రార్థించటం ఎంతో మంచిది.పెరుగన్నం, దేవునికి నైవేద్యంగా పెట్టిన తరువాత కాకులకు పెట్టాలి. అనాథ బాలలకు అన్నదానం చేయాలి. పై వాటిలో ఏది పాటించినా శని ప్రసన్నుడవుతాడు. శనివారానికి అధిపతి శనేశ్వరుడు. సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా ‘ఏడు’శనికి ప్రీతికరమయిన సంఖ్య అని ప్రతి శనివారం శని భగవానుడిని ప్రార్థిస్తే శనిగ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. శనిభగవానుడు స్తోత్రప్రియుడు, కరుణామయుడు కావున శనీశ్వరుడిని భక్తి ప్రపత్తులతో పూజించిన వారికి గ్రహదోషాలు తొలగిపోతాయి. అంతేగాకుండా.. “శని” భగవానునికి అత్యంత ప్రీతికరమైన శనివారం రోజున శనిత్రయోదశి రోజున ఏకాదశ రుద్రాభిషేకం, మహన్యాస, లఘున్యాస తైలాభిషేకం వంటి విశేష పూజలు చేయించే వారి గ్రహదోషాలు దరిచేరవని పురాణాలు చెప్తున్నాయి. ఓం శం శనైశ్చరాయ నమః

Updated On 23 March 2024 1:46 AM GMT
Ehatv

Ehatv

Next Story