హైదరాబాద్‌లో(Hyderabad) మరోసారి బంగారం ధరలు(Gold Price) భగ్గుమన్నాయి. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.61,800 ఉండగా ఈరోజు మరో వెయ్యి పెరిగింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,890కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.56,650 ఉండగా ఈరోజు రూ.57,650కి చేరింది.
హైదరాబాద్‌లో(Hyderabad) మరోసారి బంగారం ధరలు(Gold Price) భగ్గుమన్నాయి. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.61,800 ఉండగా ఈరోజు మరో వెయ్యి పెరిగింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,890కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.56,650 ఉండగా ఈరోజు రూ.57,650కి చేరింది. బంగారం ధరలు మరో 4,5 రోజులపాటు ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటున్నారు. వెండి ధరలు కూడా భారీగానే పెరిగాయి. ఈరోజు కిలో వెండి(Silver) ఏకంగా రూ.2,500 పెరిగి 79,500కు చేరింది. అంతర్జాతీయంగా డాలర్(Dollar) విలువ పెరగడమే బంగారం ధరలు పెరగడానికి కారణమని మార్కెట్ నిపుణుల భావన. ఇజ్రాయెల్(Israel), పాలస్తీనా(Palestine) యుద్ధం కూడా పసిడి పెరుగుదలకు కారణమంటున్నారు. ద్రవ్యోల్బణంలో మార్పులు, పలు దేశాల్లో ఆర్థిక మాంద్యం బంగారం ధరల పెరుగుదలకు కారణమైనట్లు తెలుస్తోంది.