ఐదు రాష్ట్రాలలో మూడు రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో SC-ST వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. మూడు రాష్ట్రాల్లో గెలవాలంటే బీజేపీ.. రిజర్వ్‌డ్ సీట్ల మ్యాజిక్‌ను బద్దలు కొట్టాలి. గత ఎన్నికల్లో ఈ స్థానాల్లో పేలవమైన పనితీరు బీజేపీని అధికారానికి దూరం చేసింది.

ఐదు రాష్ట్రాలలో మూడు రాష్ట్రాలు మధ్యప్రదేశ్(Madhya Pradesh), ఛత్తీస్‌గఢ్(Chhattisgarh), రాజస్థాన్‌(Rajastan)లో SC-ST వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. మూడు రాష్ట్రాల్లో గెలవాలంటే బీజేపీ(BJP).. రిజర్వ్‌డ్ సీట్ల(Reserved Seats) మ్యాజిక్‌ను బద్దలు కొట్టాలి. గత ఎన్నికల్లో ఈ స్థానాల్లో పేలవమైన పనితీరు బీజేపీని అధికారానికి దూరం చేసింది. రిజర్వ్‌డ్ సీట్లలో మూడింట రెండొంతుల స్థానాలు గెలుచుకుని అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న బీజేపీ కలను కాంగ్రెస్‌(Congress) గల్లంతు చేసింది.

ఈ మూడు రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాల(Assembly Polls) సంఖ్య 520. వీటిలో దాదాపు 35 శాతం అంటే 180 సీట్లు SC-ST అభ్యర్థులకు రిజర్వ్ చేయబడ్డాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఈ సీట్లలో మూడింట ఒక వంతు కంటే తక్కువ సీట్లు గెలుచుకోగలిగింది.

మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది అంటే రిజర్వ్‌డ్ సీట్లలో పేలవమైన పనితీరు కార‌ణంగానే అని చెప్ప‌వ‌చ్చు. రాష్ట్రంలో రిజర్వ్‌డ్ సీట్ల సంఖ్య 82. ఇందులో బీజేపీకి గ‌త ఎన్నిక‌ల్లో 25 సీట్లు మాత్రమే వచ్చాయి. 2013 ఎన్నికల్లో బీజేపీ పార్టీకి 53 సీట్లు వచ్చాయి. 82 స్థానాలకు గానూ కాంగ్రెస్‌ పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో 40 సీట్లు గెలుచుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ గెలుచుకున్న సీట్ల సంఖ్య దాదాపు సగానికి తగ్గగా.. కాంగ్రెస్‌ గెలుచుకున్న సీట్ల సంఖ్య 12 నుంచి 40కి పెరిగింది.

2013 ఎన్నికలతో పోలిస్తే 2018లో రిజర్వ్‌డ్ సీట్ల విషయంలో ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌ సీట్ల సంఖ్య 39. బీజేపీ పార్టీ కేవలం ఆరు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. 2013లో పది ఎస్సీ రిజర్వ్‌డ్ సీట్లలో బీజేపీకి తొమ్మిది రాగా.. అది 2018లో రెండుకి తగ్గింది. అలాగే ఎస్టీలకు రిజర్వు చేసిన 29 స్థానాల్లో బీజేపీకి కేవలం నాలుగు సీట్లు మాత్రమే వచ్చాయి. రిజర్వ్‌డ్ స్థానాల్లో బీజేపీ పేలవమైన పనితీరు కారణంగా.. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో మూడు వంతుల మెజారిటీ వచ్చింది.

రాజస్థాన్‌లో 25 ఎస్టీ రిజర్వేషన్‌ సీట్లు, 34 ఎస్సీ రిజర్వేషన్‌ సీట్లు ఉన్నాయి. 2013 ఎన్నికల్లో 34 ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాల్లో 32 గెలుచుకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే గత ఎన్నికల్లో ఈ సంఖ్య 11కి తగ్గింది. అయితే అప్పట్లో ఒక్క సీటు కూడా గెలవని కాంగ్రెస్ 21 సీట్లు గెలుచుకుంది. ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాల్లో కూడా బీజేపీపై కాంగ్రెస్ పైచేయి సాధించింది. 2013 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ 13 స్థానాలకు బదులుగా 10 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ ఏడు స్థానాలకు బదులు 13 సీట్లు గెలుచుకుంది.

Updated On 10 Oct 2023 11:15 PM GMT
Yagnik

Yagnik

Next Story