ఇండియా కూటమి విచ్ఛిన్నం కావాలని బీజేపీ(BJP) ఆకాంక్షిస్తున్నది కానీ అలా జరగడం లేదు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 17 లోక్‌సభ స్థానాలను ఇచ్చి సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party) పొత్తును పటిష్టం చేసింది. ఢిల్లీలో(Delhi) కూడా కాంగ్రెస్‌కు మూడు లోక్‌సభ స్థానాలను ఇచ్చి తమ బంధం తెగిపోలేదని ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Admi Party) స్పష్టం చేసింది.
ఇండియా కూటమి విచ్ఛిన్నం కావాలని బీజేపీ(BJP) ఆకాంక్షిస్తున్నది కానీ అలా జరగడం లేదు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 17 లోక్‌సభ స్థానాలను ఇచ్చి సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party) పొత్తును పటిష్టం చేసింది. ఢిల్లీలో(Delhi) కూడా కాంగ్రెస్‌కు మూడు లోక్‌సభ స్థానాలను ఇచ్చి తమ బంధం తెగిపోలేదని ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Admi Party) స్పష్టం చేసింది. నిన్నటి వరకు కాంగ్రెస్ పోకడలను తిట్టిపోసిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamatha Banerjee) ఇప్పుడు ఆ పార్టీతో చర్చలకు రెడీ అయ్యింది. తన పంతం తగ్గించుకున్నారు మమత. బెంగాల్‌లో(Bengal) దాదాపు ఆరు లోక్‌సభ స్థానాలలో కాంగ్రెస్ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తంమీద 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇండియ కూటమికి(INDIA Alliance) బూస్ట్ లభించింది. సీట్ల సర్దుబాటు విషయంలో మమత ఓ మెట్టు దిగారు. గతంలో పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని మమతా బెనర్జీ చెప్పారు కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నారు. బెంగాల్‌లోనే కాదు, మేఘాలయలో కూడా కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. మరికొన్ని రోజుల్లో సీట్ల పంపకంపై ఇరు పార్టీల మధ్య తుది చర్చలు జరిగే అవకాశం ఉంది. చర్చలు ఫలప్రదం అయితే మాత్రం బెంగాల్‌లో ఇండియా కూటమి బలపడినట్టే! బెంగాల్‌లో కాంగ్రెస్‌కు ఆరు లోక్‌సభ స్థానాలను ఇవ్వడానికి మమతా రెడీగా ఉన్నారు. బెంగాల్‌లోని బెహ్రంపూర్, దక్షిణ మాల్దా, ఉత్తర మాల్దా, రాయిగంజ్, డార్జిలింగ్, పురిలియా స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసే అవకాశం ఉంది. ఇందుకు మమతా బెనర్జీ కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి ప్రతిగా మేఘాలయ, అసోంలలో ఒక్కో సీటును తృణమూల్ కాంగ్రెస్ అడుగుతోంది.