కరోనా(Corona) భూతం మళ్లీ జడలు విప్పుకుని జనాలను భయపెడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తరిస్తోంది. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి(Tirupati) నగరంలో కూడా నాలుగు కరోనా కేసులు నమోదు కావడం తీవ్ర కలకలం రేపింది. రుయా ఆసుపత్రిలో(Ruya Hospital) చేసిన కోవిడ్‌ ర్యాపిడ్‌ పరీక్షల్లో(Covid Rapid Test) నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్య అధికారులు అప్రమత్తం అయ్యారు.

కరోనా(Corona) భూతం మళ్లీ జడలు విప్పుకుని జనాలను భయపెడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తరిస్తోంది. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి(Tirupati) నగరంలో కూడా నాలుగు కరోనా కేసులు నమోదు కావడం తీవ్ర కలకలం రేపింది. రుయా ఆసుపత్రిలో(Ruya Hospital) చేసిన కోవిడ్‌ ర్యాపిడ్‌ పరీక్షల్లో(Covid Rapid Test) నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్య అధికారులు అప్రమత్తం అయ్యారు. జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన నలుగురికి అనుమానంతో కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. కరోనా సోకిన వారిని అనంతపురానికి చెందిన ఓ వ్యక్తి, బెంగళూరుకు చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు, తిరుపతికి చెందిన దంపతులు ఉన్నారు. అనంతపురం, బెంగళూరు నుంచి వచ్చిన పేషంట్లను ఐడీహెచ్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తిరుపతికి చెందిన దంపతులను ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా అధికారులు హై అలెర్ట్(High Alert) అయ్యారు.

Updated On 30 Dec 2023 2:05 AM GMT
Ehatv

Ehatv

Next Story