తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉంది. భక్తుల నుంచి భారీ డిమాండ్ కూడా ఉంటుంది. శ్రీవారికి ఎంతో ప్రీతికరమైన ఈ లడ్డూలు..ఇప్పుడు అయోధ్యలోనూ భక్తులకు పంపిణీ చేయనున్నారు. టీటీడీ ప్రత్యేకంగా తయారు చేసిన లక్ష లడ్డూలు అయోధ్యకు చేరుకున్నాయి. తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక కార్గో ఎయిర్‌క్రాఫ్ట్‌ ద్వారా అయోధ్యకు తరలించారు.

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉంది. భక్తుల నుంచి భారీ డిమాండ్ కూడా ఉంటుంది. శ్రీవారికి ఎంతో ప్రీతికరమైన ఈ లడ్డూలు..ఇప్పుడు అయోధ్యలోనూ భక్తులకు పంపిణీ చేయనున్నారు. టీటీడీ ప్రత్యేకంగా తయారు చేసిన లక్ష లడ్డూలు అయోధ్యకు చేరుకున్నాయి. తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక కార్గో ఎయిర్‌క్రాఫ్ట్‌ ద్వారా అయోధ్యకు తరలించారు. జనవరి 22న అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవంతోపాటు, బాలరాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఈ మహాత్తర ఘట్టం కోసం దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని 25 గ్రాముల బరువు గల లక్ష లడ్డూల‌ను భక్తులకు పంపిణీ చేయాలని టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. దీని కోసం గురువారం తిరుమ‌లలోని శ్రీ‌వారి సేవాస‌ద‌న్‌-1లో సిద్ధం చేశారు. శ్రీ‌వారి సేవ‌కులు ఒక్కో క‌వ‌ర్‌లో రెండు చిన్న ల‌డ్డూలు చొప్పున ప్యాకింగ్ చేశారు. 50 మంది శ్రీ‌వారి సేవ‌కులు లడ్డూల ప్యాకింగ్ సేవ‌లో పాల్గొన్నారు. స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసిన ఈ లడ్డూలను ఏరో గ్రూప్ సహాయంతో చాపర్ ద్వారా అయోధ్యకు పంపించినట్లు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు.

Updated On 20 Jan 2024 4:35 AM GMT
Ehatv

Ehatv

Next Story