ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని బహ్రైచ్(Bahraich)జిల్లాలో తోడేళ్ల దాడి(Wolf Attack)లో మూడేళ్ల బాలిక మృతి చెందగా
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని బహ్రైచ్(Bahraich)జిల్లాలో తోడేళ్ల దాడి(Wolf Attack)లో మూడేళ్ల బాలిక మృతి చెందగా, మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. ఇప్పటి వరకు తోడేళ్ల దాడిలో ఆరుగురు చిన్నారులు, ఒక మహిళ చనిపోయారు. బహ్రైచ్‌లోని 35 గ్రామాలలో ఒకటైన టెప్రా(Tepra) గ్రామంలో ఈ ఘటన జరిగింది. టెప్రా గ్రామంలో తోడేళ్ల దాడికి సంబంధించి నమోదైన మొదటి సంఘటన ఇదేనని డీఎం బహ్రైచ్ మోనికా రాణి తెలిపారు. తోడేళ్లను పట్టుకునేందుకు అటవీ శాఖ తన శాయశక్తులా కృషి చేస్తోంది’’ అని అధికారులు ఒక వార్తా సంస్థకు తెలిపారు. ఈ మధ్య కాలంలో నెలల్లో, బహ్రైచ్‌లోని మహసీ తహసీల్‌లో తోడేళ్ల సమూహం దూకుడుగా మారిందని, జూలై నుండి దాడులు తీవ్రమవుతున్నాయని అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్‌లో జంతువులను గుర్తించడానికి అటవీ అధికారులు థర్మల్ ఇమేజింగ్ డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారు. దీనికి 'ఆపరేషన్ భేదియా' (Operation Bhediya)అని పేరు పెట్టారు. అయితే, తోడేళ్లు నిరంతరం తమ స్థానాలను మారుస్తుండటంతో, అటవీ అధికారులు ఇప్పుడువాటిని పట్టుకోవడానికి పిల్లల మూత్రంలో ముంచిన రంగురంగుల టెడ్డీ బొమ్మలను ఎరగా ఉపయోగిస్తున్నారు.