గ్లాస్ డోర్‌తో ఆడుకుంటున్న ఓ చిన్నారి.. ఆ డోర్‌లోనే మృత్యదేవత పొంచి ఉందని తెలుసుకోలేకపోయింది. ఆ గాజు తలుపు ఒక్కసారిగా మీద పడటంతో మూడేళ్ల ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. పంజాబ్‌లోని లుథియానా ఘుమర్ మండి మార్కెట్‌లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
గ్లాస్ డోర్‌తో(Glass door) ఆడుకుంటున్న ఓ చిన్నారి.. ఆ డోర్‌లోనే మృత్యదేవత పొంచి ఉందని తెలుసుకోలేకపోయింది. ఆ గాజు తలుపు ఒక్కసారిగా మీద పడటంతో మూడేళ్ల ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. పంజాబ్‌లోని(Punjab) లుథియానా(Ludhiana) ఘుమర్ మండి మార్కెట్‌లో(Ghumar Mandi Market) ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. చిన్నారి ప్రాణాలు కోల్పోయిన దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. వివరాలలోకి వెళితే మూడేళ్ల చిన్నారితో కలిసి ఓ కుటుంబం బట్టలషాపుకు వచ్చింది. తల్లిదండ్రులు వస్త్రాల కొనుగోలులో నిమగ్నమయ్యారు. ఆ పాప షాపు ఎంట్రన్స్ దగ్గర ఉన్న తలుపు హ్యాండిల్‌ను పట్టుకుని అటూ ఇటూ ఊగుతూ ఆడుకుంటోంది. సడన్‌గా గ్లాస్ డోర్ మొత్తం ఊడిపోయి ఆ పాపపై పడింది. ఇది గమనించిన తల్లిదండ్రులు, షోరూమ్ సిబ్బంది వెంటనే పాపను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు ప్రతి ఒక్కరికి కంటతడి పెట్టిస్తున్నాయి. బోల్టులు లూజుగా ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది. అయితే ఈ ఘటనపై తల్లిదండ్రులు ఇప్పటి వరకు ఎలాంటి కంప్లయింట్ చేయలేదని పోలీసులు తెలిపారు.