అయోధ్యలో(Ayodhya) నిర్మితమవుతున్న రామాలయంలో రాముడి(RAm mandir) ప్రాణప్రతిష్టకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే రాముడి విగ్రమం రామ్‌లల్లా(Ram lalla) గర్భగుడికి చేరుకుంది. 22వ తేదీన జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి(Inauguration) ప్రధాని మోదీతో(PM Modi) పాటు చాలా మంది ప్రముఖులు హాజరవుతున్నారు.
అయోధ్యలో(Ayodhya) నిర్మితమవుతున్న రామాలయంలో రాముడి(RAm mandir) ప్రాణప్రతిష్టకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే రాముడి విగ్రమం రామ్‌లల్లా(Ram lalla) గర్భగుడికి చేరుకుంది. 22వ తేదీన జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి(Inauguration) ప్రధాని మోదీతో(PM Modi) పాటు చాలా మంది ప్రముఖులు హాజరవుతున్నారు. దాంతో అయోధ్యలో భద్రతను(Security) ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. పోలీసులు అయోధ్యను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నగరవ్యాప్తంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. డ్రోన్ల(Drone) ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు అయోధ్య జిల్లాలో యూపీ యాంటి టెర్రరిజమ్ స్క్వాడ్ పోలీసులు చాకచక్యంతో వ్యవహరించి ముగ్గురు అనుమానితుల ఉగ్రవాదులను(Terrorist) అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురిని విచారిస్తున్నారు. వీరు ఏ గ్రూపుకు చెందిన వారో తెలియాల్సి ఉంది. గర్భగుడిలో రామ్ లల్లాను ప్రతిష్ఠించేందుకు ముందు విగ్రహాన్ని నీటితో శుభ్రం చేసే జలదివస్‌తో పాటు గణేశ పూజ, వరుణ పూజ నిర్వహించారు. కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ అనే శిల్పి చేతుల మీదుగా రూపుదిద్దుకున్న 51 అంగుళాల ఈ విగ్రహం బుధవారం రాత్రి అయోధ్యకు చేరుకుంది.