అయోధ్యలో(Ayodhya) రామాలయం(Ram Mandir) ప్రారంభోత్సవం ఈ నెల 22వ తేదీన జరగనుంది. అదే రోజున రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కూడా జరగనుంది. ప్రధాని నరేంద్రమోదీ(PM Naendra Modi) చేతుల మీదుగానే ఈ కార్య్రమాలన్నీ జరుగుతాయి. ఈ సందర్భంగా చత్తీస్‌గఢ్‌(Chattisgrah), అసోం(Assam), ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) రాష్ట్రాలు జనవరి 22వ తేదీని డ్రై డే గా(Dry Day) ప్రకటించాయి.

అయోధ్యలో(Ayodhya) రామాలయం(Ram Mandir) ప్రారంభోత్సవం ఈ నెల 22వ తేదీన జరగనుంది. అదే రోజున రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కూడా జరగనుంది. ప్రధాని నరేంద్రమోదీ(PM Naendra Modi) చేతుల మీదుగానే ఈ కార్య్రమాలన్నీ జరుగుతాయి. ఈ సందర్భంగా చత్తీస్‌గఢ్‌(Chattisgrah), అసోం(Assam), ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) రాష్ట్రాలు జనవరి 22వ తేదీని డ్రై డే గా(Dry Day) ప్రకటించాయి. అంటే ఆ రోజు మద్యం అమ్మకాలు ఉండవు. ఒక్క మద్యం దుకాణాల్లోనే కాదు, పబ్బులు, క్లబ్బులు, రెస్టారెంట్లలో కూడా మద్యం దొరకదు.జనవరి 22ను జాతీయ పండుగలా జరుపుకుంటామని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌(Yogi adityanath) ఇప్పటికే చెప్పారు. ఆ రాష్ట్రంలో జనవరి 22న అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు న్యూయార్క్‌లోని(New York) ఐకానిక్ టైమ్స్ స్క్వేర్ నుండి రామాలయం ప్రారంభోత్సవం ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ కార్యక్రమం భారతదేశంలోని వేలాది దేవాలయాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ భారతీయ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది.

Updated On 12 Jan 2024 12:57 AM GMT
Ehatv

Ehatv

Next Story