తెలంగాణలోనే(Telangana) కాదు, దేశం మొత్తం ఎండలు దంచి కొడుతున్నాయి. వడగాడ్పులు భయంకరంగా వీస్తున్నాయి. వారం రోజుల్లోనే ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. ఎండలు మండిపోతున్నాయి. మహారాష్ట్రలోని విదర్భ, మరఠ్వాడ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 45
తెలంగాణలోనే(Telangana) కాదు, దేశం మొత్తం ఎండలు దంచి కొడుతున్నాయి. వడగాడ్పులు భయంకరంగా వీస్తున్నాయి. వారం రోజుల్లోనే ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. ఎండలు మండిపోతున్నాయి. మహారాష్ట్రలోని విదర్భ, మరఠ్వాడ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతున్నాయి. జనం ఇంటి నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. వేరువేరు ప్రాంతాలలో వడదెబ్బతో ముగ్గురు చనిపోవడంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమయ్యింది. జల్‌గావ్ జిల్లాలోని రావేర్‌లోని నమ్రతా చౌదరి, అమల్‌నేర్‌లోని రూపాలి రాజ్‌పుత్, నాందేడ్ జిల్లాలోని విశాల్ మాదస్‌వార్ ఎండవేడిని తట్టుకోలేక చనిపోయారు. ఈ ముగ్గురు వడదెబ్బతోనే మృతి చెందినట్లు సంబంధిత డాక్టర్లు తెలిపారు. వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.