ఓబీసీల(OBC) గుర్తింపుకై 1946 లో ఎర్పాటు చేసిన రాజ్యాంగ(Constitution) సభలో చర్చ మొదలైంది. రాజ్యాంగంలో ఓబీసీలను చేర్చేందుకు అంబేద్కర్ ఉపకరించినారు. చర్చలో భాగంగా పలువురు సభ్యులు ఓ బి సి ల కోసం తలపెట్టిన ఆర్టికల్ ను అభ్యంతరం చెబుతూ వ్యతిరేకించారు. ఇలాంటి అభ్యంతరాన్ని ఎస్సీ, ఎస్టీలకు ముందుగా ఎదురైంది. కానీ అంబేద్కర్(Ambedkar) నిరసించడంతో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు ఒప్పుకున్నారు. కానీ ఓబీసీ సమస్య చర్చకు వచ్చినప్పుడు సభ్యులు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు.
ఓబీసీల(OBC) గుర్తింపుకై 1946 లో ఎర్పాటు చేసిన రాజ్యాంగ(Constitution) సభలో చర్చ మొదలైంది. రాజ్యాంగంలో ఓబీసీలను చేర్చేందుకు అంబేద్కర్ ఉపకరించినారు. చర్చలో భాగంగా పలువురు సభ్యులు ఓ బి సి ల కోసం తలపెట్టిన ఆర్టికల్ ను అభ్యంతరం చెబుతూ వ్యతిరేకించారు. ఇలాంటి అభ్యంతరాన్ని ఎస్సీ, ఎస్టీలకు ముందుగా ఎదురైంది. కానీ అంబేద్కర్(Ambedkar) నిరసించడంతో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు ఒప్పుకున్నారు. కానీ ఓబీసీ సమస్య చర్చకు వచ్చినప్పుడు సభ్యులు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. ఓ బీసీలు ఎవరు? వీరిని ఎలా గుర్తిస్తారు? ఓ బీసీలు గుర్తింపు అంత సులభమైనది కాదు. ఇది లాయర్లకు కోర్టులలో స్వర్గంగా తయారవుతుంది, అని వారి భావాలను వ్యక్తపరిచినారు.
అంబేద్కర్ గారు స్పందిస్తూ ఓబీసీని నెహ్రూ గారు రాజ్యాంగ లక్ష ప్రకటనలో పేర్కొన్నారని తెలిపినారు. లక్ష ప్రకటన చేస్తూ నెహ్రూ(Nehru) గారు ఈ దేశం ముందు రాజ్యాంగం ఎలాంటి లక్ష్యంతో ముందుకు రాబోతుందని తెలపడం జరిగింది. ఇందులో భాగంగా నెహ్రూ గారు వివిధ రాజ్యాంగ లక్ష్యాలను చెప్పుతూ మైనారిటీలకు, దళితులకు, ఆదివాసీ ప్రాంతాలకు, ఓబీసీలకు సరిపోను రక్షణలను (Adequate protection) కల్పిస్తామని చేప్పడమైంది. రాజ్యాంగ సభ 'ఆబ్జెక్టివ్ రిజర్వేషన్లు' ఏకగ్రీవంగా తీర్మానించడం అయినది. ఇది రిజర్వేషన్ కాదు ఒక డిక్లరేషన్ అని అదేవిధంగా అండర్ టేకింగ్ అని ప్రతిజ్ఞ అని రాజ్యాంగ సభ ప్రకటించడం అయినది. కాబట్టి సభ్యుల ఆబ్జెక్షన్స్ను పక్కకు పెట్టి రాజ్యాంగం ఆర్టికల్ 16 (4) చేర్చడమైనది. మరాఠా సమాజానికి చెందిన పంజాబ్ రావు దేశ్ముఖ్ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్స్ కల్పించాలని డిమాండ్ చేసైనారు. రాజ్యాంగ సభలో వెనుకబడిన కులాల ప్రాతినిధ్యం అంతంత మాత్రమే. ఆస్టిన్ పేర్కొన్న మేరకు వారు మూడు శాతంగా చెప్పడం జరిగింది. అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ సమస్యలు చర్చించడానికి వారి సామాజిక వర్గాల నుండి లేకపోవడం బీసీలకు అతి తీవ్రమైన నష్టం రాజ్యాంగ రచనలో జరిగింది.
1950 జనవరి 26న రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ భారత్ ను రిపబ్లిక్ గా ప్రకటన సమయంలో పంజాబ్ రావు దేశ్ముఖ్ నాయకత్వంలో అదే రోజు ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ ఏర్పడింది. ఆ రోజు నుండి దేశంలో బీసీ ఉద్యమం పెద్ద ఎత్తున ముందుకు వచ్చింది. దేశ్ముక్కు గారుని మంత్రిగా భారత ప్రభుత్వంలో నియమించడంతో అధ్యక్ష స్థానాన్ని చౌదరి బ్రహ్మ ప్రకాష్ యాదవ్ నియమితులైనారు. బ్రహ్మ ప్రకాష్ యాదవ్ గారు 33 ఏటనే ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి నారు. వారు పలు రాష్ట్రాలను పర్యటించి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ నాయకత్వాన బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని దేశం ముందుకు తెస్తూ ఉద్యమించినారు. అదే విధంగా ఆర్. ఎల్. చందాపురి (కుర్మి) నాయకత్వంలో వేరొక సంఘం కూడా జాతీయస్థాయిలో బీసీ ఉద్యమాన్ని నడిపించినారు. తర్వాత వారు సోషలిస్ట్ పార్టీలో చేరినారు. అదే సమయంలో యాదవులు కుర్మీలు, కోయిరీలు కుల సంఘాల నాయకత్వంలో 'పిచ్ డొంకు జగావ్, దేశ్ బచావో' అనే నినాదాన్ని దేశం ముందు కు తీసుకొచ్చినారు. ఈ క్రమంలో పలు సంఘాలు, పలు వర్గాలు, నాయకులు ముఖ్యంగా లోహియా నాయకత్వంలో సోషలిస్ట్ పార్టీ ముందుకు వచ్చింది. సోషలిస్టు పార్టీ సన్సా ప నే బాందిగ్రంద్, పిచ్డా పావే సౌ మే సాట్' అనే నినాదంతో రాజకీయ ఉద్యమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకంగా సాగినది. అందుకే బహుశా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో గత మూడు నాలుగు దశాబ్దాలుగా బీసీల నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రులు కన్పిస్తారు. దక్షిణ భారతదేశంలో ద్రవిడ ఉద్యమం పెద్ద ఎత్తున బ్రాహ్మనేతర పోరాటాలలో బీసీ అధికారం కై ఉద్యమించినారు. ముఖ్యంగా అంబేద్కర్ కుల నిర్మూలన ఉద్యమం, ద్రవిడ సోషలిస్టు ఉద్యమం ల ఫలితంగా తమిళనాడు, యూపీ, బీహార్లలో సామాజిక న్యాయం ఈరోజు వరకు ఉద్యమిస్తునే వస్తున్నది.
భారత ప్రభుత్వం 1953లో మొదటి బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ ఏర్పాటు చేసినారు. ఆ కమిషన్ 1955లో రిపోర్టును ప్రభుత్వానికి అందించినారు. 1956లో కాంగ్రెస్(Congress) నాయకత్వంలోని ప్రభుత్వం మొదటి బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ రిపోర్టును(Backward Classes Commission Report) తిరస్కరించినది. దీనికి కారణం చెబుతూ వెనుకబడిన వర్గాలను గుర్తించమంటే వెనుకబడిన కులాలను గుర్తించినారు కాబట్టి రిపోర్టును తిరస్కరించడం జరిగిందన్నారు. దీని ద్వారా కులతత్వం పెరుగుతుందని, సెకండ్ క్లాస్ సిటిజెన్సు ప్రభుత్వ రంగంలో చేరుతారని, మెరిట్ దెబ్బతింటుందని, చెబుతూ రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్లు ఏర్పాటు చేసి ఓబీసీల గుర్తింపుకు వెళ్ళొచ్చు అని జిబి పంత్ హోమ్ మినిస్టర్ గారు పార్లమెంట్లో ప్రకటించినారు.
పలు రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్లను ఏర్పాటు చేసి ఓబీసీల గుర్తింపుకై, వారి అబివృద్దికై సూచించాలంటూ కోరడమైనది. దాదాపు 10, 15 కమిషన్ల రిపోర్టులను తప్పుపడుతూ కోర్టులలో కొట్టివేయబడినాయి.
ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన జేపీ ఉద్యమం జనతా పార్టీని ఏర్పాటు చేయడమైనది. వారు మొదటి వెనుకబడిన కమిషన్ రిపోర్టును అమలు చేస్తామని వారి మేనిఫెస్టోలో చేర్చినారు. వారి ద్వారా ఏర్పడిన ప్రభుత్వం ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ గారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ మొదటి కమిషన్ ఏర్పాటు చేసి దాదాపు రెండు దశాబ్దాలు అయినై అందుకు ఇప్పుడు రెండో బీసీ కమిషన్ ఏర్పాటు చేద్దామని నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిషన్కు బిందేశ్వరి ప్రసాద్ మండల్, పూర్వ ముఖ్యమంత్రి, బీహార్ రాష్ట్రం, గారిని చైర్మన్గా నియమించబడినాడు. 1979 జనవరిలో మొదలుపెట్టిన కమిషన్ 1980 డిసెంబర్ చివరికి రిపోర్ట్ను ఇందిరా కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రభుత్వానికి, ఆనాటి ప్రెసిడెంట్, భారత దేశం గార్లకు సమర్పించినారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం రెండో కమిషన్ రిపోర్టును తనభిలో పెట్టి తాళం వేసింది. మళ్లీ జనతా దళ్ నాయకత్వంలోని ప్రధానమంత్రి విపి సింగ్ గారు ఆగస్టు 7, 1990లో మండల్ రిపోర్టులోని ఒక రికమండేషన్ను అమలు చేస్తామని పార్లమెంటులో ప్రకటించినారు. అది ఉద్యోగాలలో రిజర్వేషన్ కు సంబంధించినది. మండల్ కమిషన్ రిపోర్టు ఆమోదాన్ని ఆనాటి కాంగ్రెస్-బిజెపి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించినయి. బిజెపి పార్టీ అద్వానీ గారి నాయకత్వంలో ఒక అడుగు ముందుకేసి రామజన్మభూమి రథయాత్ర పేరుమీద మండల్ రిపోర్టు ప్రతిపాదించిన ఓబీసీల గుర్తింపు వారి అభ్యున్నతికై రికమండు చేసిన 40 సిఫారసులను వ్యతిరేకించారు. పలు సంఘాలు, వ్యాపార సంస్థలు, విద్యార్థులు, పరిశ్రమ నాయకులు ఓబీసీ లకు సంబంధించిన మండల్ రిపోర్టును వ్యతిరేకించారు. కానీ అదే సమయంలో జనతాదళ్ పార్టీకి చెందిన శరధ్ యాదవ్ గారు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు, పాశ్వాన్ గారు, మూలయం సింగ్ యాదవ్ గారు గాక ఇంకా ఎంతోమంది మండల్ రిపోర్టు పూర్తిస్థాయి అమలుకై ఉద్యమించినారు. అంతకుముందు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు శ్రీకాన్షిరాం గారు 'ఆరక్షన్ లాగు కరో, నైతో కుర్షి కాళీ కరో' అని ఉద్యమించినారు. చివరకు 1992 నవంబర్లో సుప్రీం కోర్ట్ రాజ్యాంగ బెంజ్ మెజారిటీ తీర్పు మేరకు మండల కమిషన్ రిపోర్ట్ సరి అయినదిగా సమర్థించడం జరిగింది. దాంట్లో భాగంగా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లను భారత అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. 1993లో భారత ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో భాగంగా ఓబీసీలకు ఐఏఎస్, ఐపీఎస్, లాంటి సంస్థలలో ఓ బి సి రిజర్వేషన్ అమలులోకి వచ్చింది. దాని పర్యవసానం ఆనాడు కేంద్ర సంస్థలలో 4.7 పర్సెంట్ గా ఐఏఎస్ ఐపీఎస్ లలో ఉన్న ఓబీసీలు ఈరోజు దాదాపు 11 శాతానికి కేంద్ర ప్రభుత్వంలో కనిపిస్తున్నారు. 2006లో హెచ్ఆర్డి మినిస్టరైన అర్జున్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగంగా విద్యాసంస్థలలో కూడా ఓబీసీ రిజర్వేషన్స్ ను అమలు చేయడం మొదలయింది. దాంతో 2008 నుండి ఐఐటి, ఐఎం, కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో ఓబీసీలు రిజర్వేషన్లు పొందుతూ చదువుకోవడం మొదలయింది.
ఇక్కడ అంత తీవ్రంగా ఓబీసీలను వ్యతిరేకించిన భారత పాలకవర్గం చివరకు సుప్రీం కోర్ట్ అంగీకారంతో ఓబిసి రిజర్వేషన్లు అమలు చేయడం మొదలయింది. ఎన్నో కమిషన్ రిపోర్ట్ లను కొట్టివేయబడ్డప్పటికీ మండల కమిషన్ రిపోర్టును ఆమోదించబడటం మండల్ ఓబీసీలకు, భారతదేశానికి అందించిన ఘనవిజయంగా పేర్కొనాలి. అందుకే 'బీపీ మండల్ను ఓబీసీ పితామహుడుగా' పిలుస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడ దాదాపు 3743 కులాలకు ఓబీసీ గుర్తింపు ఇవ్వడం లో బీపీ మండల్ గారు ఆచరించిన శాస్త్రీయ దృక్పథం గా చెప్పవచ్చు. అదేవిధంగా ఓబీసీల ఉన్నతికై రెండో కీలకమైన 40 రికమండేషన్లను భారత ప్రభుత్వానికి అందివ్వడం 52% గా ఉన్న ఓబీసీలకు ఒక 'మినీ ఓబిసి అభివృద్ధి రాజ్యాంగంగా' దేశం ముందు నిలబెట్టినారు.
చివరగా ఒక మాట రిజర్వేషన్ల ఉద్యమము ఈ దేశంలో మొదటిసారిగా ప్రవేశపెట్టింది కొల్హాపూర్ రాజైన సాహు మహారాజు గారు. వీరు పాలనలో ఒకే కులమ్ ఆధిపత్యాన్ని గమనించి సంస్కరణలకై ముందుకు వచ్చినారు. అందులో భాగంగా జులై 26, 1902 లో బ్రాహ్మనే తరులకు 50 శాతం రిజర్వేషన్ కల్పించినారు. ఇది ఎంతో ప్రజాస్వామిక ఆలోచన అయినప్పటికీ స్వాతంత్ర్య సమరయోధులైన తిలక్ గారు, వారితోపాటు బ్రాహ్మణ సామాజిక వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. తిలక్ గారు ఒక అడుగు ముందుకేసి కుంభీలు, శింపీలు (దర్జీలు) పాలనలో కూర్చొని భూమి దున్నుతర, లేక బట్టలు కుడుతరా? అంటూ పాలనకు అనర్హులుగా చిత్రీకరించడమైనది. దురదృష్టవశాత్తు పార్టీల రూపంలో బ్రాహ్మనిజం ఈరోజు కూడా రిజర్వేషన్లను అడ్డుకునే విధంగా ప్రభుత్వ పాలసీలు మన దేశం మీద రుద్దుతున్నారు.
అందుకే, జై సాహు, జై భీమ్, జై మండల్, జై INDIA.
ప్రొఫెసర్ ఎస్ సింహాద్రి
అధ్యక్షులు, సమాజ్వాది పార్టీ,
తెలంగాణ