కొచ్చి నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానానికి సోమవారం బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర క‌ల‌క‌లం రేగింది. విమానంలో బాంబు ఉన్నట్లు కాల్ రావ‌డంతో.. విమానంలోని మొత్తం 139 మంది ప్రయాణికులను కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో దించేశారు.

కొచ్చి నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానానికి సోమవారం బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర క‌ల‌క‌లం రేగింది. విమానంలో బాంబు ఉన్నట్లు కాల్ రావ‌డంతో.. విమానంలోని మొత్తం 139 మంది ప్రయాణికులను కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో దించేశారు. సమాచారం ప్రకారం.. నంబర్ 6E6482 గ‌ల విమాన స‌ర్వీస్ ప్ర‌యాణికుల‌తో ఉదయం 10.30 గంటలకు బెంగుళూరుకు వెళ్లాల్సి ఉండగా.. బెదిరింపు కాల్‌ వచ్చింది.

కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (CIAL) ఫ్లైట్ టేకాఫ్ అవ్వబోతుండగా.. విమానాశ్రయంలోని CISF కంట్రోల్ రూమ్‌కు కాల్ వ‌చ్చిన‌ట్లు అధికారులు తెలిపారు. ఆ స‌మ‌యంలో విమానంలో 138 ప్ర‌యాణికులు, ఒక చిన్నారి ఉన్న‌ట్లు వారు తెలిపారు. అంద‌రినీ విమానం నుంచి దింపేసిన సెక్యూరిటీ సిబ్బంది.. మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు బ్యాగేజీ మొత్తాన్ని జ‌ల్లెడ ప‌ట్టిన‌ట్లు వెల్ల‌డించారు. అనుమాన‌స్ప‌దంగా ఏమి క‌నిపించ‌లేద‌ని.. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు తెలిపారు.

Updated On 28 Aug 2023 7:37 AM GMT
Ehatv

Ehatv

Next Story