ఓ క్యాంటీన్(canteen )కు వెళ్లినప్పుడు అక్కడ కొంతమంది ఉద్యోగులు, ఇతరులు కూడా తినడంతో పాటు మరో కొత్త రకం పనులకు పాల్పడుతున్నారట ... దీంతో ఆ హోటల్ యాజమాన్యంకు ఏం చేయాలో అర్ధం గాక చివరకు ఓ నిర్ణయం తీసుకున్నారట..

మనం ఎక్కడైన హోటల్(Hotel) కు వెళ్లినప్పుడు మనకు ఇష్టమైన పుడ్ ఆర్డర్ (order) చేసుకొని తింటాం... ఆ తర్వాత హోటల్ బిల్లు కట్టేసి బయటకు వస్తాం... కామన్ గా ఇలానే జరుగుతుంది కదా.. అలాగే మరి ఓ క్యాంటీన్(canteen)కు వెళ్లినప్పుడు అక్కడ కొంతమంది ఉద్యోగులు, ఇతరులు కూడా తినడంతో పాటు మరో కొత్త రకం పనులకు పాల్పడుతున్నారట ... దీంతో ఆ హోటల్ యాజమాన్యంకు ఏం చేయాలో అర్ధం గాక చివరకు ఓ నిర్ణయం తీసుకున్నారట.. ఇంతకీ ఆ క్యాంటీన్ లో ఏం జరుగుతుందో మీకు తెలుసుకోవాలని ఉంది కదూ ...అయితే ముంబయిలోని ఈ క్యాంటీన్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం.

ఎక్కడైనా ఎవరైనా.. క్యాంటిన్‌(Canteen)లో తిన్న తర్వాత ఆ ఫ్లేట్లు(Plates),గ్లాసులు(Glasses),చెంచాలు(Spoons) అక్కడే పెట్టాలి. కాని కొన్ని ప్రాంతాల్లో అయితే కొంతమంది వాటిని కూడా గుట్టు చప్పడు కాకుండా తీసుకెళ్తుంటారు. ఇలాంటి ఘటనలే ముంబయి(Mumbai)లోని బృహన్‌ముంబయ్ మున్సిపల్ కార్పొరేషన్( Brihanmumbai Municipal Corporation)ప్రధాన కార్యాలయం(headquarters)సమీపంలోని క్యాంటిన్‌(Canteen)లో జరుగుతున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ ఇది నిజం ......అక్కడ సిద్ధివినాయక్ క్యాటరర్స్ పేరుతో క్యాంటిన్‌ను నిర్వహిస్తున్నారు. ఆ క్యాంటీన్‌కు బీఎంసీలో పని చేసే ఉద్యోగులతోపాటు ఇతరులు కూడా వచ్చి టిఫిన్లు, భోజనాలు చేస్తుంటారు. అలా వచ్చిన వారు తిన్న తర్వాత అక్కడి చెంచాలను, టిఫిన్‌ ప్లేట్లను, గ్లాస్‌లను బ్యాగులో వేసుకొని సైలెంట్ గా సైడై పోతు వెళ్లిపోతున్నారట.

దీనిపై ఆ క్యాంటీన్ యాజమాన్యం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ...ఈ ఫ్లేట్లు, గ్లాసులు, చెంచాల మిస్సింగ్ గోల మాత్రం తగ్గలేదట . దీంతో చివరకు క్యాంటీన్‌లోనే పుడ్ తినాలని, బయటకు ఫ్లేట్లు, గ్లాసులు, చెంచాల వంటి వాటిని తీసుకెళ్లొద్దని క్యాంటీన్ యాజమాన్యం వినియోగదారుల్ని కోరుతూ(requested) ఓ నోటీసు బోర్డు(notice board)పెట్టింది. క్యాంటీన్‌లోని వస్తువులను బీఎంసీలో పని చేసే ఉద్యోగుల(employees)తోపాటు ఇతరులు కూడా బయటకు తీసుకెళ్లిపోతున్నట్లు మా దృష్టికి వచ్చింది. చెంచాలు, ప్లేట్లు, గ్లాసులు కనిపించడం లేదు. దీనివల్ల మిగతా వారు ఇబ్బందులకు గురవుతున్నారని ఆ నోటీసు బోర్టులో తెలిపింది. అలాగే ఇక్కడి వస్తువులను ఎవరూ బయటకు తీసుకెళ్లొద్దని.. ఇప్పటి వరకు 6000కు పైగా చెంచాలు, 400 ప్లేట్లు, 100కు పైగా గ్లాసులు పోయాయని ఓ లిస్ట్ కూడా ఆ నోటిస్ బోర్డ్ లో పెట్టింది. అయితే మరి ఇప్పటికైనా ఇలాంటి పనులకు పాల్పడేవారిలో మార్పు వచ్చి... ఫ్లేట్లు, గ్లాసులు, చెంచాల మిస్సింగ్ గోల తప్పుతుందో లేదో చూడాలి మరి.

Updated On 15 April 2023 5:49 AM GMT
madhuri p

madhuri p

Next Story