అసోం(Assam)లోని బార్పేట(Barpeta)జిల్లా జానియా గ్రామం.. తెల్లారి పొలాల్లోకి వెళ్లిన రైతులకు భయానక దృశ్యం కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసి వారు ఉలిక్కిపడ్డారు. విచలితులయ్యారు. ఒక్కసారిగా వణికిపోయారు. అంతగా వారిని భయపెట్టిన ఆ దశ్యం.. వేలాది పక్షులు పంటపొలాల్లో చనిపోయి ఉండటం. ఈ సంఘటన అసోంలో కలకలం రేపుతోంది. ఎవరో వాటికి విషం పెట్టి చంపేశారని భావిస్తున్నారు.
అసోం(Assam)లోని బార్పేట(Barpeta)జిల్లా జానియా గ్రామం.. తెల్లారి పొలాల్లోకి వెళ్లిన రైతులకు భయానక దృశ్యం కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసి వారు ఉలిక్కిపడ్డారు. విచలితులయ్యారు. ఒక్కసారిగా వణికిపోయారు. అంతగా వారిని భయపెట్టిన ఆ దృశ్యం.. వేలాది పక్షులు పంటపొలాల్లో చనిపోయి ఉండటం. ఈ సంఘటన అసోంలో కలకలం రేపుతోంది. ఎవరో వాటికి విషం పెట్టి చంపేశారని భావిస్తున్నారు. ఆ వికృత చర్యకు పాల్పడిన అరాచక శక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని బయో డైవర్సిటీ కన్జర్వేషన్ గ్రూప్ అరణ్యక్ డిమాండ్ చేసింది. విష ప్రయోగంతోనే వేలాది పక్షలు చనిపోయాయన్న వార్త తెలియగానే పక్షి ప్రేమికులు తల్లడిల్లిపోయారు. ఆవేదన చెందారు. పంటపొలాల్లోని ధాన్యపు గింజలను తిన్న తర్వాతే అవి చనిపోయాయి. పంటపొలాల నుంచి పక్షులను తరిమివేసేందుకే ఎవరో ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న అరణ్యక్ సీఈవో డాక్టర్ విభాబ్ కుమార్ దిగ్భ్రాంతి చెందారు. వేలాది పక్షులు చనిపోవడం తనను ఎంతో కలచివేస్తున్నదని చెప్పారు.
యంత్రాలతో పోల్చిచూస్తే పక్షులు పంట దిగుబడికి ఎంతో సాయపడతాయన్నారు. పంటలకు నష్టం కలిగించే కీటకాలు,పురుగులను పక్షులు తింటాయని, ఫలితంగా పంటనష్ట నివారణ జరుగుతుందని విభాబ్ కుమార్ తెలిపారు. పక్షుల కారణంగా పంటపొలాల్లో రసాయన మందుల వాడకం తగ్గుతుందన్నారు.