మీకో ఘరానా దొంగను పరిచయం చేస్తాను. దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) ఉంటాడు. ఇతడిని పట్టుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఎనిమిది సార్లు ఫలించాయి. ఇదిగో ఇప్పుడు తొమ్మిదోసారి కూడా అతడిని పట్టుకున్నారు పోలీసులు. తొమ్మిది సార్లు తొమ్మిది పేర్లతో ఇతడు దొరికాడు. ఇంతకాలం పోలీసుల కన్నుగప్పి చోరీలు చేస్తూ వచ్చాడు.. ఇది అందరు దొంగలు చేసే పనే అయినా ఇతడు మాత్రం దొంగలకే దొంగ.
మీకో ఘరానా దొంగను పరిచయం చేస్తాను. దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) ఉంటాడు. ఇతడిని పట్టుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఎనిమిది సార్లు ఫలించాయి. ఇదిగో ఇప్పుడు తొమ్మిదోసారి కూడా అతడిని పట్టుకున్నారు పోలీసులు. తొమ్మిది సార్లు తొమ్మిది పేర్లతో ఇతడు దొరికాడు. ఇంతకాలం పోలీసుల కన్నుగప్పి చోరీలు చేస్తూ వచ్చాడు.. ఇది అందరు దొంగలు చేసే పనే అయినా ఇతడు మాత్రం దొంగలకే దొంగ. తను దోచుకున్న దొంగ సొమ్ముతో ఢిల్లీ మొదలుకొని నేపాల్ వరకు ఎన్నో ఆస్తులను కూడబెట్టాడు. ఒక్క ఢిల్లీలోనే ఒంటరిగా రెండొందలకు పైగా దొంగతనాలు చేశాడు. తన భార్య పేరుతో సిద్ధార్థనగర్‌లో ఓ గెస్ట్ హౌస్(Guest House), తన పేరుతో నేపాల్‌లో ఒక హోటల్(Hotel) కొన్నాడు. అలాగే లక్నో(Lucknow), ఢిల్లీలలో కూడా సొంతంగా ఇళ్లు కట్టుకున్నాడు. 2001 నుంచి 2023 వరకూ ఈ దొంగపై 15కు పైగా నేరపూరిత కేసులు నమోదయ్యాయి. ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో మోడల్ టౌన్ పోలీసులు కోటీశ్వరుడైన ఓ హోటల్ వ్యాపారిని అరెస్ట్ చేశారు. అతడిని మనోజ్ చౌబేగా గుర్తించారు.
పాతికేళ్లుగా అతడు కుటుంబానికి దూరంగా ఉంటూ జీవిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం 45 ఏళ్ల మనోజ్ చౌబే కుటుంబం ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో ఉండేది. తర్వాత ఈ కుటుంబం నేపాల్‌కు వెళ్లింది. 1997లో మనోజ్ ఢిల్లీకి వచ్చాడు. కీర్తినగర్ పోలీస్‌స్టేషన్‌లో క్యాంటిన్ నిర్వహించాడు. ఆ క్యాంటిన్‌లోనే చోరీ చేస్తూ పోలీసులకు దొరికాడు. జైలుకు వెళ్లాడు. జైలు నుంచి విడుదలయ్యాక ఇళ్లను లక్ష్యంగా పెట్టుకుని దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. భారీ మొత్తంలో సొమ్మును కూడబెట్టిన తర్వాత తన గ్రామానికి వెళ్లిపోతుండేవాడు. చోరీ సొమ్ముతో మనోజ్ చౌబే నేపాల్‌లో ఓ హోటల్ ఏర్పాటు చేశాడు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ ఉద్యోగి కూతురును పెళ్లి చేసుకున్నాడు. తను ఢిల్లీలో పార్కింగ్ కాంట్రాక్టు పనులు చేస్తుంటానని అత్తామామలను నమ్మించాడు. ఇందుకోసం తాను ఆరు నెలలకు ఒకసారి ఢిల్లీకి వెళ్లి రావాల్సి ఉంటుందని చెప్పాడు. తాజాగా మనోజ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి దగ్గర్నుంచి లక్ష రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.