అయోధ్యలో శ్రీరాముడి (Lord Rama) ప్రాణ ప్రతిష్ఠాపనకు విగ్రహ (Idol) ఎంపిక ఖరారైనట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి (Prahalad Joshi) సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కర్నాటకకు (Karnataka) చెందిన ప్రముఖ శిల్పి యోగిరాజ్ ( Yogiraj) అరుణ్ చెక్కిన శ్రీరాముడి విగ్రహాన్ని అయోధ్యలోని నూతన రామా మందిరంలో (Ramalayam) ప్రతిష్ఠించనున్నారు. ఆ విగ్రహం ఫొటోను ప్రహ్లాద్ జోషి ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ (Arun Yogiraj) చెక్కిన శ్రీరాముడి విగ్రహాన్ని అయోధ్యలోని అద్భుతమైన శ్రీరామ మందిరంలో ప్రతిష్టించడానికి ఎంపిక చేశారని, ఇది రాష్ట్రంలోని మొత్తం రామ భక్తుల గర్వాన్ని, ఆనందాన్ని రెట్టింపు చేసిందని కర్నాటకకు చెందిన బీజేపీ నేత యడ్యూరప్ప (Yadyurappa) ట్వీట్ చేశారు. యోగిరాజ్‌కు హృదయపూర్వక అభినందనలంటూ యడ్యూరప్ప ట్వీట్ చేశారు. అని తెలిపారు. అరుణ్ యోగిరాజ్ రూపొందించిన విగ్రహాలను జనవరి 22న ప్రధాని మోదీ (PM Modi) సమక్షంలో అయోధ్య రామ మందిర గర్భాలయంలో ప్రతిష్టించనున్నారు. కర్నాటకలోని మైసూరుకు చెందిన ఈ శిల్పి చెక్కిన అయిదేళ్ల బాలరాముడి విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్టించనున్నారు. జనవరి 22వ తేదీన అయోధ్యలో ఆ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు.