కర్ణాటకలోని(Karnataka) దావణగెరెలో(Davanagere) నమ్మశక్యం కాని ఓ వింత ఘటన జరిగింది. శివమొగ్గ(shivamogga) జిల్లాలోని భద్రావతి ప్రాంతంలో నవంబర్ 16వ తేదీన 21 ఏళ్ల తిప్పేశ్‌బైక్‌పై(Tippesh) వెళుతున్నప్పుడు రోడ్డపై ఓ వీధి కుక్క(street Dog) అడ్డుగా వచ్చింది. ఆ కుక్కను తప్పించబోయి రోడ్డు ప్రమాదానికి(Road Accident) గురయ్యాడు. అక్కడే తీవ్ర గాయలతో కన్నుమూశాడు. అయితే తిప్పేశ్ మరణానికి కారణమైన ఈ కుక్క అతడి మృతదేహాన్ని(Dead Body) తరలించిన వాహనం వెంట వెళ్లింది. ప్రమాద స్థలం నుంచి తిప్పేశ్ ఇల్లు సుమారు ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది. ఆ కుక్క అక్కడి వరకూ వెళ్లింది.
కర్ణాటకలోని(Karnataka) దావణగెరెలో(Davanagere) నమ్మశక్యం కాని ఓ వింత ఘటన జరిగింది. శివమొగ్గ(shivamogga) జిల్లాలోని భద్రావతి ప్రాంతంలో నవంబర్ 16వ తేదీన 21 ఏళ్ల తిప్పేశ్‌బైక్‌పై(Tippesh) వెళుతున్నప్పుడు రోడ్డపై ఓ వీధి కుక్క(street Dog) అడ్డుగా వచ్చింది. ఆ కుక్కను తప్పించబోయి రోడ్డు ప్రమాదానికి(Road Accident) గురయ్యాడు. అక్కడే తీవ్ర గాయలతో కన్నుమూశాడు. అయితే తిప్పేశ్ మరణానికి కారణమైన ఈ కుక్క అతడి మృతదేహాన్ని(Dead Body) తరలించిన వాహనం వెంట వెళ్లింది. ప్రమాద స్థలం నుంచి తిప్పేశ్ ఇల్లు సుమారు ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది. ఆ కుక్క అక్కడి వరకూ వెళ్లింది. అంత్యక్రియలప్పుడు(Funeral) కూడా అక్కడే ఉంది. ఆ వీధిలోని కుక్కల బారి నుంచి తప్పించుకున్న ఆ కుక్క మూడు రోజుల తర్వాత తిప్పేశ్ ఇంట్లోకి వెళ్లింది. తల్లి యశోదమ్మ దగ్గరకు చేరుకుంది. ఆమె చేతిపై తలపెట్టి పశ్చాత్తాపం(Guilt) వ్యక్తం చేసింది. అప్పటి నుంచి ఆ కుక్క ఆ ఇంట్లోనే ఉంది. చాలా చిత్రంగా ప్రవర్తిస్తున్న ఈ కుక్క(Gog) గురించి తిప్పేశ్ కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు వారు మీడియాకు చెప్పారు. ఆ కుక్కపై తమకు ఎలాంటి కోపమూ లేదని తిప్పేశ్ సోదరి చందన తెలిపారు. సోదరుడి మరణం దురదృష్టశాత్తు జరిగిన ఘటనే తప్ప ఇందులో కుక్క ప్రమేయం ఏమీ లేదని అన్నారు. తనను బస్టాప్ దగ్గర దించి ఇంటికి తిరిగి వెళుతున్న సోదరుడిని ఆ ప్రమాదంలో కోల్పోయామని కన్నీరు పెట్టుకున్నారు. కాగా, తిప్పేశ్ మరణానికి కారణమైన ఆ కుక్కతో కుటుంబసభ్యుల అనుబంధానికి సంబంధిచిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.