వైద్య విద్యా కోర్సులలో ప్రవేశం కోసం నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(NEET) రేపు జరగనుంది. దేశవ్యాప్తంగా 499 నగరాలు, పట్టణాలలో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు జరిగే ఈ పరీక్షకు దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని అధికారులు చెబుతున్నారు.

వైద్య విద్యా కోర్సులలో ప్రవేశం కోసం నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(NEET) రేపు జరగనుంది. దేశవ్యాప్తంగా 499 నగరాలు, పట్టణాలలో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు జరిగే ఈ పరీక్షకు దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని అధికారులు చెబుతున్నారు. తెలుగుతో పాటు 13 ప్రాంతీయ భాషలలో పరీక్ష ఉంటుంది.

పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్‌ కార్డుతో(Admit card) పాటు ఏదైనా ఓ గుర్తింపు కార్డును(ID proof) తప్పనిసరిగా తీసుకెళ్లాలి. అటెండెన్స్‌ షీట్‌ మీద పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటోను(Passport size photo) అతికించాల్సి ఉంటుంది కాబట్టి పాస్‌పోర్ట్‌ ఫోటోను తీసుకెళ్లడం మర్చిపోవద్దు. అభ్యర్థులు డ్రెస్‌కోడ్‌ను(Dress Code) తప్పనిసరిగా పాటించాలి. పొడవు చేతులున్న దుస్తులు, నగలు, ఇతర మెటల్‌ వస్తువులను హాల్లోకి అనుమతించరు.

అలాగే బూట్లకు(Shoes) బదులు స్లిప్పర్లు(Slippers), తక్కువ ఎత్తున్న శాండిల్స్‌ మాత్రమే ధరించాలి. పరీక్షా కేంద్రానికి పేపర్లు, పెన్సిల్‌ బాక్సులు, క్యాలిక్యులేటర్లు, స్కేల్స్‌, రైటింగ్‌ ప్యాడ్స్‌, పెన్‌డ్రైవ్‌లు, జామెట్రీ బాక్సులు, ఎలక్ట్రానిక్‌ వస్తువులను అనుమతించరు. అలాగే చేతి గడియారాలు, స్మార్ట్‌ వాచ్‌లు, పర్సులు, హ్యాండ్‌బ్యాగులు, బెల్ట్‌లు, టోపీలు వంటివి కూడా ధరించకూడదు. మొబైల్‌ఫోన్లు, బ్లూటూత్‌ వంటి వాటిని ఇంటివద్దనే వదిలేసి వెళ్లడం ఉత్తమం. వాటిని ఎగ్జామ్‌ సెంటర్‌లో అనుమతించరు..

పరీక్ష రాయడానికి బాల్‌పాయింట్‌ పెన్నును ఎగ్జామ్‌ హాల్లోనే ఇస్తారు కాబట్టి పెన్ను కూడా తీసుకెళ్లకూడదు. ఎగ్జామ్‌కు బయలుదేరే ముందు ఒకటికి రెండుసార్లు తాము తీసుకెళ్లే వస్తువులు ఉన్నాయో లేదో చెక్‌ చేసుకోవడం మంచిది. ముందురోజే అన్నింటిని తీసిపెట్టుకుంటే నిశ్చితంగా ఉండవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్‌ హాల్‌కు ఓ గంట ముందు చేరుకునేలా ప్లాన్‌ చేసుకోండి.. ఆల్‌ ది బెస్ట్‌ స్టూడెంట్స్‌.. EHA మీకు బెస్ట్ ఆఫ్ లక్ అందిస్తోంది...

Updated On 6 May 2023 1:36 AM GMT
Ehatv

Ehatv

Next Story