తమిళనాడులోని(Tamilnadu) కోయంబత్తూరులో(Coimbatore) భారీ చోరీ(Theft) జరిగింది. ఓ ప్రముఖ బంగారం షోరూమ్‌లోకి(Gold show room) చొరపడిన దొంగ షాపంతా కలయతిరిగి కిలోల కొద్దీ బంగారాన్ని దొంగిలించాడు. దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు షోరూమ్‌లోని సీసీటీవీ ఫుటేజ్(CCTV Footage) ద్వారా వెలుగులోకి వచ్చాయి. గాంధీపురం ప్రాంతంలో ఉన్న జోస్ అలూక్కస్ బంగారు ఆభరణాల షాపులో చోరీ జరిగింది.

Jos Alukkas robbery
తమిళనాడులోని(Tamilnadu) కోయంబత్తూరులో(Coimbatore) భారీ చోరీ(Theft) జరిగింది. ఓ ప్రముఖ బంగారం షోరూమ్‌లోకి(Gold show room) చొరపడిన దొంగ షాపంతా కలయతిరిగి కిలోల కొద్దీ బంగారాన్ని దొంగిలించాడు. దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు షోరూమ్‌లోని సీసీటీవీ ఫుటేజ్(CCTV Footage) ద్వారా వెలుగులోకి వచ్చాయి. గాంధీపురం ప్రాంతంలో ఉన్న జోస్ అలూక్కస్(Jos Alukkas jewellery store) బంగారు ఆభరణాల షాపులో చోరీ జరిగింది. అర్థరాత్రి దాటిన తర్వాత ఓ వ్యక్తి షాప్‌లోకి దూరాడు. తర్వాత షో రూమ్ మొత్తం రౌండేశాడు. నచ్చిన బంగారాన్ని తన వెంట తెచ్చుకున్న సంచిలో నింపుకున్నాడు. తర్వాత వచ్చిన దారిలోనే బయటకు వెళ్లిపోయాడు. ఉదయం షోరూమ్ తెరిచిన సిబ్బంది చోరీని గుర్తించి పోలీసులకు(Police) కంప్లయింట్ చేశారు. ఒక్కడే సుమారు పాతిక కిలోల బంగారం, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లాడు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ వేలిముద్రలు, సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయిదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దొంగ కోసం వెతుకుతున్నారు.
