పది రోజులుగా తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి దూరాడో దొంగ(Thief). ఇంట్లో ఉన్న వస్తువలన్నింటినీ మూటగట్టాడు.
పది రోజులుగా తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి దూరాడో దొంగ(Thief). ఇంట్లో ఉన్న వస్తువలన్నింటినీ మూటగట్టాడు. ఆ ఇంట్లోంచి బయటపడే టైమ్‌లో ఆ ఇల్లు ఓ ప్రముఖ రచయితదని(Writter) తెలుసుకున్నాడు. ఓ రచయిత ఇంట్లో దొంగతనం చేయడమా? అని ఆవేదన చెందాడు. తప్పు తెలుసుకున్నాడు. దొంగలించిన వస్తువులను ఎక్కడిదక్కడ పెట్టేశారు. తనను క్షమించమని వేడుకుంటూ ఓ నోట్ రాసి పెట్టి వెళ్లాడు. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఈ విచిత్రం చోటు చేసుకుంది. ప్రముఖ మరాఠీ కవి, సామాజికవేత్త నారాయణ్ సువే 2010లో చనిపోయారు. ప్రస్తుతం ఆయన ఇంట్లో కూతురు సుజాత, అల్లు డు గణేశ్ ఘారే ఉంటున్నారు. పక్షం రోజుల కిందట విరార్‌లో ఉంటున్న కొడుకు దగ్గరకు వెళ్లారు. పది రోజులుగా ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన ఓ దొంగ ఇంట్లో దూరాడు. విలువైన వస్తువున్నీ సర్దేసుకున్నాడు. చివరికి ఎల్‌ఈడీ టీవీని కూడా వదల్లేదు. అయినా కొన్ని వస్తువులు మిగిలిపోయాయి. వాటిని ఎత్తుకెళ్లడానికి మర్నాడు కూడా ఇంట్లో దూరాడు. కొంత సామాను మూటగట్టుకున్నాక ఇంట్లో ఓ రౌండేశాడు. అప్పుడు అతడికి నారాయణ్ సువే(Narayan Suve) ఫోటో, ఆయనకు వచ్చిన మెమొంటోలు, అవార్డులు కనిపించాయి. దొంగగారిలో పశ్చాత్తాప భావన వచ్చేసింది. ముందు రోజు దొంగిలించిన వస్తువులను కూడా తిరిగి ఇంట్లో పెట్టేశారు. ప్రముఖ సాహితీవేత్త ఇంట్లో దొంగతనం చేసినందుకు తనను క్షమించాలని కోరుతూ ఓ లేఖ రాసి గోడకు అతికించాడు. విరార్ నుంచి తిరిగి వచ్చిన సుజాత, గణేశ్‌లు ఆ లేఖ చూసి ఆశ్చర్యపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీవీపై లభించిన ఫింగర్‌ప్రింట్స్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ముంబాయిలో అనాథగా పెరిగిన నారాయణ కూలి పనులు చేసుకుంటూ చదవడం, రాయడం నేర్చుకున్నాడు. చదివింది రెండో తరగతే అయినప్పటికీ మరాఠీ భాషలో ఉత్తమ రచయితగా ఎదిగారు.