ఏదైనా పని ప్రారంభించడానికి ముందు భగవంతుడిని ప్రార్థించడం చాలా మందికి అలవాటు. అలాంటి అలవాటు దొంగలకు కూడా ఉంటుంది.
ఏదైనా పని ప్రారంభించడానికి ముందు భగవంతుడిని ప్రార్థించడం చాలా మందికి అలవాటు. అలాంటి అలవాటు దొంగలకు కూడా ఉంటుంది. ఏం నమ్మకం కలగడం లేదా? అయితే ఈ స్టోరీ వినండి.. మధ్యప్రదేశ్‌లోని మచల్‌పూర్ జిల్లాలో సుజల్‌పూర్ హైవేపై సోయత్ కలాన్ దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ ఆఫీసులోకి ఓ వ్యక్తి చొరపడ్డాడు. ఎంటరవ్వగానే పక్కనే పూజా స్థలాన్ని చూసి భక్తితో దేవుల్ల ముందు ఒంగొని ప్రార్థన చేశాడు. తర్వాత సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేయడానికి ప్రయత్నించాడు. అటు పిమ్మట అంతా వెతికి 1.57 లక్షల రూపాయలను దొంగిలించాడు. పని అయ్యాక అక్కడ్నుంచి పారిపోతున్నప్పుడు పెట్రోల్ బంకు(Petrol Pump) దగ్గర నిద్రపోతున్న సిబ్బందికి మెలకువ వచ్చింది. ఆ వ్యక్తిని పట్టుకునేందుకు వెంబడించాడు కానీ అతడు దొరకలేదు. పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలంలో ఇనుప రాడ్, చీరను గుర్తించారు. మరోవైపు దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.