పురుషులందు పుణ్యపురుషులు వేరుగా ఉన్నట్టుగానే దొంగల్లో మంచి దొంగలు వేరుగా ఉంటారు.
పురుషులందు పుణ్యపురుషులు వేరుగా ఉన్నట్టుగానే దొంగల్లో మంచి దొంగలు వేరుగా ఉంటారు. చేసేది దొంగతనాలే కానీ వారికి కూడా ఓ మనసంటూ ఉంటుంది. ఇలాంటి మంచి మనసున్న దొంగల్లో ఒకడు తమిళనాడు(Tamilnadu) తూత్తుకుడిలో ఉన్నాడు. ఇతడు ఓ ఇంటిని దోచేశాడు. కాకపోతే దోచుకున్న(Theft) సొమ్మునంతా నెల రోజుల్లో తిరిగి వస్తానంటూ ఓ లేఖ రాసి పెట్టి వెళ్లాడు. డిటైల్స్‌లోకి వెళితే మేఘ్నాపురానికి(Meghnapuram) చెందిన చిత్తిరై సెల్విన్ దంపతులు ఉపాధ్యాయులుగా పని చేసి పదవీవిరమణ చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. వీరికి ఓ కొడుకు, ముగ్గురు కూతుళ్లు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. వారంతా వేరే వేరే ఊళ్లలో ఉంటున్నారు. జూన్ 17వ తేదీన భార్యాభర్తలిద్దరూ చెన్నైలో(chennai) ఉంటున్న ఓ కూతరు దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో ఇంటిని చూసుకోవడానికి సెల్వి అనే మహిళను నియమించుకున్నారు. మొన్న సోమవారం సాయంత్రం సెల్వి ఇంటిని క్లీన్ చేయడానికి వెళ్లింది. తలుపులు తెరిచి ఉండటం చూసి కంగారుపడింది. వెంటనే విషయాన్ని యజమానికి చెప్పింది. ఆగమేఘాల మీద చిత్తిరై సెల్వన్ చెన్నై నుంచి వచ్చేశారు. ఇంట్లోకి వెళ్లి చూస్తే బీరువాలో ఉన్న 60 వేల రూపాయల నగదు, బంగారు నగలు చోరీకి గురయ్యాయని తెలుసుకున్నాడు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు ఘటన స్థలికి వచ్చి పరిశీలించారు. వారికి ఓ లేఖ దొరికింది. ఆ ఉత్తరం దొంగే రాశాడని పోలీసులు గుర్తించారు. అందులో ఏమున్నదంటే 'నన్ను క్షమించండి. నెలలోపు వీటిని తిరిగి ఇచ్చేస్తాను. మా ఇంట్లో ఒకరికి అనారోగ్యంగా ఉంది. అందుకే దొంగతనం చేయాల్సి వచ్చింది' అని దొంగ రాసిపెట్టాడు. ఈ ఉత్తరాన్ని చూసి పోలీసులు, చిత్తిరై సెల్వన్‌తో పాటు స్థానికులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ ఉత్తరం స్థానికంగా సంచలనంగా మారింది.