సినిమా(Movies) వినోదం కోసం మాత్రమే కాదు.. సినిమా ఎంతో మందిపై ప్రభావాన్ని చూపిస్తుంది. అటువంటి సినిమాలు కొన్ని అద్భుతమైన మెసేజ్ లు ఇస్తుంటాయి. వినోదంతో పాటు.. వివేకాన్నికలిగించే ఓన్నో సినిమాలు వెండితెరను పావనం చేశాయి. ముఖ్యంగా దేశ భక్తిని(Patriotism) కలిగించే సినిమాలు ఎన్నో మన తెలుగు తెరపై వెలుగు వెలిగాయి. సీతారామరాజు(sitharamaraju) నుంచి.. ఆర్ఆర్ఆర్(RRR) వరకు తెలుగు తెరనుపావనం చేసిన దేశ భక్తి సినిమాలు కొన్నింటిని చూద్దాం.

సినిమా(Movies) వినోదం కోసం మాత్రమే కాదు.. సినిమా ఎంతో మందిపై ప్రభావాన్ని చూపిస్తుంది. అటువంటి సినిమాలు కొన్ని అద్భుతమైన మెసేజ్ లు ఇస్తుంటాయి. వినోదంతో పాటు.. వివేకాన్నికలిగించే ఓన్నో సినిమాలు వెండితెరను పావనం చేశాయి. ముఖ్యంగా దేశ భక్తిని(Patriotism) కలిగించే సినిమాలు ఎన్నో మన తెలుగు తెరపై వెలుగు వెలిగాయి. సీతారామరాజు(sitharamaraju) నుంచి.. ఆర్ఆర్ఆర్(RRR) వరకు తెలుగు తెరనుపావనం చేసిన దేశ భక్తి సినిమాలు కొన్నింటిని చూద్దాం.

జనరేషన్ ను బట్టి సినిమా.. ఏ విషయానైనా.. ఆ జనరేషన్ కు తగ్గట్టు చూపించడంలో సినిమాది ప్రముఖ పాత్ర అని చెప్పాలి. ఈ విషయంలో దేశ భక్తి అనే అంశాన్ని సినిమాలు ఆయా కాలాలను బట్టి అద్భుతంగా చూపించారు. ఆడియన్స్ లో దేశ భక్తి ప్రవహించేలా ఉత్తేజ పరిచేలా చేశారు. అందులు రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్(RRR) మూవీ గురించి మాట్లాడుకోవాలి. కొమురం భీమ్(komaram bheem) అనే పాత్రలో ఎన్టీఆర్(Jr.NTR).. అల్లూరి సీతారామరాజుగా(Alluri Sitha Rama Raju) రామ్ చరణ్(Ram). కల్పిత పాత్రలతో దేశ భక్తి చుట్టూ తిరిగిన ఈసినిమాను రాజమౌళి(Rajamouli) డ్రైవ్ చేసిన విధానం హాలీవుడ్ ను సైతం విస్మయానికి గురి చేసింది. ఆస్కార్ వరకూ చేరేలా చేసింది. దేశ భక్తి నరనరాల్లో నిండేలా చేసింది ఆర్ఆర్ఆర్.

దేశ భక్తి సినిమా అంటే ప్రతీ ఒక్క తెలుగు ప్రేక్షకుడికి గుర్తుకు వచ్చే సినిమా అల్లూరి సీతారామ రాజు(Alluri Sitha Rama Raju). అవును ఇప్పటికీ దేశ భక్తి అంటే ప్రతీ తెలుగువారికి మదిలో మెదిలే సినిమా అది. తెలుగు వీర లేవరా అంటూ సాగే పాట.. సీతారామరాజుగా కృష్ణ నటన అజరామరంగా నిలిచిపోయింది. ఎన్ని దశాబ్ధాలు గడుస్తున్నా.. ఈసినిమా క్రేజ్ మాత్రం అలానే ఉంది. స్వాతంత్ర సమరయోధుడిగా సీతారామరాజు త్యాగాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది.

దేశ భక్తి ఉరకలు వేసేలా చేసిన సినిమాల్లో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కలిసిన సినిమాలు కూడా ఉన్నాయి. నటసార్వభౌముడు నందమూరి తారకరాముడు తన చివరిరోజుల్లో నటించి సినిమా మేజర్ చంద్ర కాంత్(Major Chandhrakanth). మాజీ సైనికుడిగా.. దేశాన్ని ప్రేమించే వ్యక్తిగా ఆయన నటన.. డైలాగ్స్.. పాటలు ఈసినిమాను విజయ తీరాలకు చేర్చడమే కాదు.. జన్మభూమి నాదేశం అంటూ సాగే పాట ప్రతీ ఒక్క తెలుగోడి నరనరాల్లో దేశ భక్తి ఉప్పొంగి ప్రవహించేలా చేస్తుంది. ఇప్పటికీ ఆ పాట.. ఆసినిమా అలా తెలుగు హృదయాల్లో నిలిచిపోయింది.

దేశభక్తి.. వివాదం ఈరెండు అంశాలతో తెరకెక్కిన సినిమా ఖడ్గం(Khadgam). కృష్ణ వంశీ తెరకెక్కించిన ఈసినిమాలో శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, రవితేజ లాంటి స్టార్స్ సందడి చేశారు. ఈసినిమా అప్పట్లో వివాదం అయినా.. హిందూ ముస్లీంల ఐక్యతను చాటింది. దేశంపై హిందువులతో పాటు.. ముస్లీమ్స్ కు ఉన్న ప్రేమను చాటింది. పాకిస్తాన్ కుతంత్రాలను కళ్ళకు కట్టినట్టు చూపించింది. మరీ ముఖ్యంగా 1990లో జరిగిన ముంబయ్ దాడులను ఆధారంగా చేసుకుని తీసిన ఖడ్గం.. దేశ భక్తిని ఉరకలు వేసేలా చేసింది.

దేశ భక్తి సినిమాల్లో..విక్టరీ వెంకటేష్ నటించిన సుభాష్ చంద్రబోస్ సినిమా కూడా ఒకటి. కాని ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. ఈసినిమా ప్లాప్ అయినా సరే.. చాలా మందిలో మూవీ ఉత్తేజపరిచింది. కథ బాగానే ఉంది. కాని ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు కాని.. ఈమూవీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.

దేశ భక్తిని రకరకాలుగా చూపించారు దర్శకులు. స్వతంత్ర సమరయోధుల కథలే కాదు..దేశం మీద ప్రేమ ఉండి..దేశంకోసం పోరాడిన కల్పిత పాత్రలతో కూడా సినిమాలు చాలా వచ్చాయి. అందులో భారతీయుడు(Indian) సినిమా కూడా ఉంది. దేశం కోసం ప్రాణాలు ఇచ్చే ఓ పెద్దాయిన.. అన్యాయం చేస్తే ప్రాణాలు తీయగల వ్యక్తి కథతో ఈమూవీని డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు దర్శకుడు శంకర్. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం వచ్చిన ఈమూవీ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ గా భారతీయుడు2(Indian 2) తెరకెక్కుతోంది.

ఇక ఈ మధ్యలో వచ్చిన దేశ భక్తి సినిమాల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి(Uyyalawada Narasimha Reddy) జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా సైరా నరసింహారెడ్డి(Syra Narasimha reddy).
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తరువాత చేసిన ఈసినిమాలో ఒక్కొక్క డైలాగ్ భారీగా పేలాయి.. నరసింహారెడ్డి త్యాగాన్ని.. బ్రిటీష్ వారిపై ఆయన పోరాటాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించింది సినిమా.

ఇవే కాదు.. సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి, జై, రోజా, ఇలా అప్పుడు ఇప్పుడు ఎన్నో సినిమాలు దేశ భక్తిని పెరిగేలా .. ప్రతీ ఒక్కరిలో దేశం అంటే ప్రేమ ఉరకలు వేసేలా చేశాయి. 76వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు.

Updated On 13 Aug 2023 5:28 AM GMT
Ehatv

Ehatv

Next Story