కాంగ్రెస్‌ పార్టీ ఆఫీసు శిలాఫలకంపై 'తెలుగు'కు చోటు లేదా

కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజధానిలోని 24 అక్బర్ రోడ్‌లోని తన జాతీయ ప్రధాన కార్యాలయాన్ని బుధవారం కొత్త చిరునామాకు - 9A, కోట్లా రోడ్‌లోని ఇందిరా భవన్‌కు మారింది. ఐదంతస్తుల కొత్త కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, పార్లమెంటు సభ్యురాలు ప్రియాంక గాంధీ సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు. 139 ఏళ్ల పార్టీ జాతీయ రాజధానిలోని లుట్యెన్స్ బంగ్లా జోన్ (LBZ)లో 24, అక్బర్ రోడ్ ప్రధాన కార్యాలయంలో 47 సంవత్సరాలు గడిపింది. కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధాన కార్యాలయం "ఇందిరా భవన్" ప్రజాస్వామ్యం, జాతీయవాదం, లౌకికవాదం, సమ్మిళిత అభివృద్ధి మరియు సామాజిక న్యాయం యొక్క పునాదిపై నిర్మించబడింది. కొత్త AICC ప్రధాన కార్యాలయానికి భారతదేశపు మొదటి మహిళా ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పేరు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ తన దిగ్గజాల దార్శనికతను నిలబెట్టేందుకు చేస్తున్న నిరంతర మిషన్‌కు ఇది ప్రతీక అని పార్టీ పేర్కొంది.

ఇంతవరకు బాగానే ఉందనుకుందాం. ఏఐసీసీ కార్యాలయం శిలా ఫలకంలో కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం తెలుగును విస్మరించిందనే చెప్పాలి. రకరకాల భాషలో అక్కడ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయం అని అర్థం వచ్చేలా హిందీ, ఇంగ్లీష్‌, ఉర్దూ, కన్నడ, బెంగాలీ.. ఇలా పలు భాషల్లో రాశారు. కానీ అక్కడ తెలుగుకు చోటు దక్కకపోవడం గమనార్హం. తెలుగు భాష అన్న, తెలుగు రాష్ట్రాలు అన్నా కూడా జాతీయపార్టీలు నిర్లక్షం వహిస్తాయని గతంలో వచ్చిన వార్తలకు మరోసారి బలం చేకూరినట్లయింది. గతంలో పీవీ నరసింహారావు భారత ప్రధానిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఐదేళ్లు సుస్థిరంగా ప్రభుత్వాన్ని నడిపి ఎన్నో సంస్కరణలకు ఆజ్యం పోసిన ఆయన పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్యంగా వ్యవహిరించిందన్న విమర్శలు వచ్చాయి. అందరు కాంగ్రెస్ ప్రధానులకు ఏఐసీసీ ఆఫీసులో నివాళులు అర్పిస్తారు కానీ పీవీకి ఆ గౌరవం దక్కలేదు. అంతేకాదు పీవీ చనిపోయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉన్నా ఆయన ఘాట్‌కు ఢిల్లీలో స్థలం కేటాయించలేదు. మాజీ ప్రధానులందరికీ ఢిల్లీలో ఘాట్‌లు ఉంటాయి..కానీ ఒక్క పీవీ నరసింహారావుకే ఆ గౌరవం దక్కలేదు. ఇప్పుడు మరోసారి ఇలాంటి తరహా వ్యవహారశైలి కనపడిందన్న విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్సే ఉన్నా తెలుగులో ఎందుకు రాయలేదని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ నుంచి ఢిల్లీకి రావాల్సినవన్నీ వచ్చినా కానీ కాంగ్రెస్ ఈ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని విమర్శిస్తున్నారు.

ehatv

ehatv

Next Story