ఈరోజుల్లో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థంకాని పరిస్థితి నెలకొంది. నమ్మి నానపోస్తే, పుచ్చి బుర్రలైనట్టు మాటల గారడీతో బురిడీ కొట్టించి, ఇంట్లో అద్దెకు దిగింది ఓ ప్రబుద్దురాలు. ఇంటి యజమానురాలు బంగారాన్ని కాజేయాలని కన్నేసింది. ఇందుకు ప్రియుడి సహకారం కోరడంతో ప్రియుడు అంగీకరించాడు. ఇంకేముంది ప్రియుడితో కలిసి యజమానురాలి గొంతు నులిమి చంపి మెడలో ఉన్న బంగారం తీసుకొని ఉడాయించింది.

కర్నాటకలోని (Karnataka) కెంగేరిలో (Kengeri) ఈ ఘటన చోటు చేసుకుంది. కోన సంద్రలో ఈ నెల 10న జరిగిన దివ్య (Divya) అనే మహిళ హత్య కేసును కెంగేరి పోలీసులు ఛేదించారు. తన ఇంట్లో అద్దెకుంటున్న యువతే దివ్యను గొంతు నులిమి చంపేసినట్లు నిర్ధారించారు. కెంగేరిలో గురుమూర్తి-దివ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు ఉంటున్న ఇంట్లోని ఓ పోర్షన్‌లో కోలారు (Kolaru) జిల్లాకు చెందిన మోనిక (Monika) (24) అనే యువతి కిరాయికి దిగింది. ఇంట్లోకి వచ్చే సమయంలో ప్రియుడినే భర్తగా చూపి ఇల్లు అద్దెకు తీసుకుంది. ఓ ప్రైవేట్‌ సంస్థలో డేటా ఎంట్రీ అపరేటర్‌గా పని చేస్తోంది. మోనిక ప్రియుడు అప్పుడప్పుడు ఇంటికి వస్తూ వెళ్లేపోయేవాడు. జల్సాలకు అలవాటు పడిన మోనిక తన ప్రియుడికి ఓ వాహనం కొనివ్వాలని డబ్బు కోసం ప్రయత్నించింది. దీంతో ఇంటి యజమాని దివ్య మెడలో ఉన్న బంగారంపై ఆమెకు కన్నుపడింది. ఇంటి యజమాని గురుమూర్తి శివనపాళ్యంలో (Shivana Palyam) సెలూన్‌ నడిపేవాడు, దివ్య అత్తామాలు రోజువారీ పనులకోసమని వెళ్లి తిరిగి సాయంత్ర వచ్చేవారు. ఇక దివ్య తన రెండేళ్ల కూతురుతో ఇంట్లోనే ఉండేది. ఒంటిరిగా ఉంటున్న మోనికను ఈనెల 10న తన ప్రియుడితో కలిసి చంపింది. దివ్య గొంతు పిసికి హత్య చేసి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును తీసుకొని అక్కడి నుంచి ఉడాయించింది. దివ్య హత్యపై పోలీసులకు ఫిర్యాదు చేయగా మోనికపై వారికి అనుమానం వచ్చింది. మోనికను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విసయం తెలిసింది. మోనిక ప్రియుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
————————————————

Updated On 17 May 2024 6:10 AM GMT
Ehatv

Ehatv

Next Story