జీ-20(G-20) సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్(Joe Biden) సన్నాహాలు చేశారు. త్వరలో ఇండియాకు రానున్నారు. ఇంతలో అమెరికా ప్రథమ మహిళ జిల్ బిడెన్(Gil Biden) కోవిడ్-19(Covid-19) పాజిటివ్‌గా గుర్తించారు. జిల్ బిడెన్ ప్రస్తుతం తేలికపాటి లక్షణాలతో బాధ‌ప‌డుతుంది. ఈ సమాచారాన్ని వైట్‌హౌస్‌(White house) వెల్లడించింది. ఆమె ప్ర‌స్తుతం డెలావేర్‌లోని రెహోబోత్ బీచ్‌లోని తన ఇంటిలో ఉంది.

జీ-20(G-20) సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్(Joe Biden) సన్నాహాలు చేశారు. త్వరలో ఇండియాకు రానున్నారు. ఇంతలో అమెరికా ప్రథమ మహిళ జిల్ బిడెన్(Gil Biden) కోవిడ్-19(Covid-19) పాజిటివ్‌గా గుర్తించారు. జిల్ బిడెన్ ప్రస్తుతం తేలికపాటి లక్షణాలతో బాధ‌ప‌డుతుంది. ఈ సమాచారాన్ని వైట్‌హౌస్‌(White house) వెల్లడించింది. ఆమె ప్ర‌స్తుతం డెలావేర్‌లోని రెహోబోత్ బీచ్‌లోని తన ఇంటిలో ఉంది. జిల్ బిడెన్ కు పాజిటివ్ వచ్చిన తర్వాత జో బిడెన్ కూడా కోవిడ్ -19 ప‌రీక్ష చేయించుకున్నారు. ఆయ‌న రిపోర్టు నెగిటివ్ వచ్చింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు జో బిడెన్ ను క్రమం తప్పకుండా పరీక్షిస్తున్నామ‌న్నారు.

మూలాల ప్రకారం.. G-20 శిఖరాగ్ర సమావేశానికి ముందు సెప్టెంబర్ 8న మోడీ-బిడెన్ ద్వైపాక్షిక సమావేశం ఉండవచ్చు. సెప్టెంబర్ 9న వివిధ దేశాల దేశాధినేతలు లేదా ప్రభుత్వాధినేతలు అధికారికంగా సమావేశంలో పాల్గొంటారు. ప్ర‌ధాని మోదీ, బిడెన్ ఒక గంట పాటు బేటీ అయ్యే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఇతర దేశాల అధ్యక్షులు లేదా ప్రధానమంత్రి ప్రగతి మైదాన్ నుండి తమ హోటల్‌కు బయలుదేరే సమయంలో ఈ భేటీ ఉంటుంద‌ని స‌మాచారం. ఈ సమావేశానికి భద్రతా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ‘జీ-20’ సదస్సు జ‌రుగుతుంది.

Updated On 5 Sep 2023 2:36 AM GMT
Ehatv

Ehatv

Next Story