భానుడు (Sun) భగభగమంటున్నాడు. సెగలు కక్కుతూ నిప్పులు కురిపిస్తున్నాడు. 1901 తర్వాత ఏప్రిల్‌ నెలలో ఇంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం మళ్లీ ఇప్పుడే! ఒక్క మన దగ్గరనే కాదు, దేశమంతటా ఇదే పరిస్థితి. వడగాలులు భయంకరంగా వీస్తున్నాయి.

భానుడు (Sun) భగభగమంటున్నాడు. సెగలు కక్కుతూ నిప్పులు కురిపిస్తున్నాడు. 1901 తర్వాత ఏప్రిల్‌ నెలలో ఇంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం మళ్లీ ఇప్పుడే! ఒక్క మన దగ్గరనే కాదు, దేశమంతటా ఇదే పరిస్థితి. వడగాలులు భయంకరంగా వీస్తున్నాయి. మే మాసంలో కూడా ఎండలు, వడగాలులు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ (Indian Meteorological Department) తెలిపింది. రాబోయే 11 రోజుల పాటు వడగాడ్పులు వీస్తాయని అంచనా వేసింది. ఇప్పటికే 2023 అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిందని భారత వాతావరణ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ మృత్యంజయ్‌ మహపాత్ర చెప్పారు. సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా నమోదైందని, ఏప్రిల్‌లో తూర్పు, ఈశాన్య భారతంలో సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత 28.12 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని ఆయన చెప్పారు. 1901 తర్వాత ఏప్రిల్‌లో ఇంత కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవడం ఇదే మొదటిసారన్నారు. దక్షిణ రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడా, గుజరాత్ ప్రాంతాల్లో మే నెలలో 8-11 రోజుల పాటు వేడి తరంగాలు ఉండవచ్చని మహాపాత్ర చెప్పారు. రాజస్థాన్, తూర్పు మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఇంటీరియర్ ఒడిశా, గంగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల్లో అయిదు నుంచి ఏడు రోజుల వరకు వడగాలులు వీస్తాయని చెప్పారు. ఏప్రిల్‌లో ఎండలకు ప్రధాన కారణం ఉరుములతో కూడిన వర్షాలు లేకపోవడమేనని వాతావరణశాఖ పేర్కొంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, భారతదేశానికి ఆనుకుని ఉన్న తూర్పుతీరంలో అల్ప స్థాయిలో ఏర్పడిన తుఫాను వ్యతిరేక పరిస్థితుల కారణంగా తక్కువ వర్షాపాతం నమోదైందని తెలిపింది.

Updated On 2 May 2024 4:42 AM GMT
Ehatv

Ehatv

Next Story