Times Now Opinion Poll : ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమిదే హవా.
వచ్చే ఏడాది ఏప్రిల్ - మే నెలల్లో లోక్ సభ ఎన్నికలు(Loak sabha elections) జరగనున్న తరుణంలో దేశ వ్యాప్తంగా అప్పుడే ఎన్నికల హడావుడి నెలకొంది. దీంతో పాటు ఈ డిసెంబర్ లోపల పలు కీలక రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. మరోవైపు ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ప్రజలు ఎవరి నాయకత్వం వైపు మొగ్గు చూపుతున్నారు? అనే అంశాలపై పలు మీడియా సంస్థలు సర్వేలు చేపడుతూ, ఆసక్తికర అంచనాలను వెలువరిస్తున్నాయి.
వచ్చే ఏడాది ఏప్రిల్ - మే నెలల్లో లోక్ సభ ఎన్నికలు(Loak sabha elections) జరగనున్న తరుణంలో దేశ వ్యాప్తంగా అప్పుడే ఎన్నికల హడావుడి నెలకొంది. దీంతో పాటు ఈ డిసెంబర్ లోపల పలు కీలక రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. మరోవైపు ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ప్రజలు ఎవరి నాయకత్వం వైపు మొగ్గు చూపుతున్నారు? అనే అంశాలపై పలు మీడియా సంస్థలు సర్వేలు చేపడుతూ, ఆసక్తికర అంచనాలను వెలువరిస్తున్నాయి. తాజాగా, టైమ్స్ నౌ(Times Now) తన సర్వే వివరాలను వెల్లడించింది.
ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే నరేంద్ర మోడీ(Narendra Modi) మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయమని 'టైమ్స్ నౌ ఈటీజీ" ఒపీనియన్ పోల్‌లో(Opinion Poll) తేలింది. బీజేపీ(BJP) 300కు పైగా ఎంపీ సీట్లను సాధిస్తుందని, బీజేపీ నేతృత్వంలోని ఎన్టీఏ కూటమికి దాదాపు 296 నుంచి 326 సీట్లు వస్తాయని వెల్లడైంది. ఇక విపక్ష కూటమి "ఇండియా"(I-N-D-I-A) 160 నుంచి 190 సీట్లను సాధిస్తుందని సర్వే సంస్థ పేర్కొంది.
హిందీ బెల్డ్‌లో మోడీ మ్యాజిక్ వల్ల ఎన్డీయే(NDA) ఆధిపత్యం కొనసాగుతుందని సర్వే అంచనా వేసింది. ఆ ప్రాంతంలో ఎన్డీఏ సక్సెస్ రేటు 80 శాతం ఉంటుందని తెలిపింది. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ భారీ విజయాలు సాధిస్తుందని చెప్పింది. ఈ రాష్ట్రాల్లోని 80 లోక్‌సభ సీట్లలో ఎన్‌డీఏ 70 గెలుచుకుంటుందని పేర్కొంది.
కర్ణాటక, తమిళనాడు, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు భారీ విజయాలు సాధిస్తాయని సర్వే అంచనా వేసింది. తమిళనాడులో ఇండియా కూటమికి 30-34 లోక్‌సభ సీట్లు, కర్ణాటకలో ఎన్జీఏ కూటమికి 18-20 సీట్లు దక్కే అవకాశం ఉంది. బీహార్‌లో ఎన్టీఏ కూటమికి 22 నుంచి 24 సీట్లు, ఇండియా కూటమికి 16-18 సీట్లు రావచ్చని తెలిపింది.
తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకుగానూ బీఆర్‌ఎస్ 9 నుంచి 11 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఈటీజీ- టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది. బీజేపీకి 2-3 ఎంపీ స్థానాలు, కాంగ్రెస్ కు 3-4 ఎంపీ స్థానాలు దక్కొచ్చని సర్వే తేల్చింది. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్‌సీపీ మొత్తం 25 సీట్లు కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసే అవకాశాలున్నాయని పేర్కొంది. టీడీపీకి ఒక్క ఎంపీ సీటు దక్కితే దక్కొచ్చని అంచనా వేసింది.
అధికార, విపక్ష కూటముల్లో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఎక్కువ సీట్లను గెలుచుకుంటాయని సర్వే వెల్లడించింది. బీజేపీ సొంతంగా 288 నుంచి 314 సీట్లను గెలుచుకుంటుందని.. కాంగ్రెస్ సొంతంగా 62 నుంచి 80 స్థానాలను కైవసం చేసుకుంటుందని తెలిపింది. అయితే రెండు కూటమిలకు మధ్య ఓట్ల శాతంలో తేడా మాత్రం చాలా తక్కువగానే ఉండబోతోందని పేర్కొంది. ఎన్డీయేకు 42.60 శాతం ఓట్లు, ఇండియా కూటమికి 40.20 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది.
అయితే కేవలం 2 శాతం ఓట్ల తేడాతో ఎన్డీయే ఘన విజయం సాదిస్తుందని టైమ్స్ నౌ తన తాజా సర్వేలో వెల్లడించింది