కేంద్ర ఎన్నికల సంఘానికి(Central election Commission) సుప్రీంకోర్టు(Supreme court) ఊరటనిచ్చింది. ఈవీఎం(EVM), వవీప్యాట్‌లపై(VVPAT) దాఖలైన అన్ని పిటిషన్లను(Petetions) కొట్టేసింది. ఈవీఎంల పనితీరుపై అనేక అనుమానాలున్నాయని, వీపీప్యాట్ స్లిప్‌లను ఓటర్లకు అందించాలని, ఆ తర్వాత వాటిని వందశాతం లెక్కించాలంటూ పలువురు పిటిషన్లు వేశారు.

Supreme Court
కేంద్ర ఎన్నికల సంఘానికి(Central election Commission) సుప్రీంకోర్టు(Supreme court) ఊరటనిచ్చింది. ఈవీఎం(EVM), వవీప్యాట్‌లపై(VVPAT) దాఖలైన అన్ని పిటిషన్లను(Petetions) కొట్టేసింది. ఈవీఎంల పనితీరుపై అనేక అనుమానాలున్నాయని, వీపీప్యాట్ స్లిప్‌లను ఓటర్లకు అందించాలని, ఆ తర్వాత వాటిని వందశాతం లెక్కించాలంటూ పలువురు పిటిషన్లు వేశారు. అయితే ఈ విజ్ఞప్తితో పాటుగా బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫామ్స్(ADR) పిటిషన్ వేసింది. ఈ పిటిషన్లను అన్నింటిని కలిపి సుప్రీంకోర్టు మూడు రోజులపాటు విచారణ జరిపింది. చివరకు పిటిషన్లను కొటేస్తూ తీర్పు చెప్పింది. ఒక వ్యవస్థను గుడ్డిగా అపనమ్మకంతో చూడటం అనవసర అనుమానాలకు దారి తీస్తుందని జస్టిస్ దీపాంకర్ దత్తా అన్నారు. అర్థవంతమైన విమర్శలు అవసరమని, అది న్యాయవ్యవస్థ అయినా సరే, చట్ట సభలు అయినా సరే అని ఆయన చెప్పారు. అనుమానాలతో ఈవీఎలను గుడ్డిగా వ్యతిరేకించవద్దని జస్టిస్ దీపాంకర్ దత్తా తెలిపారు.
