మోదీ(Modi) ఇంటిపేరు కేసులో(Surname Case) రాహుల్ గాంధీకి(Rahul gandhi) సుప్రీంకోర్టు(Supreme Court) పెద్ద ఊరటనిచ్చింది. రాహుల్ గాంధీ శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాహుల్ నేరారోపణపై అప్పీల్ పెండింగ్‌లో ఉన్నంత వరకు.. ఆయ‌న‌ శిక్షపై స్టే విధిస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఈ నేప‌ధ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాహుల్ పాల్గొనవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరించినట్లు రాహుల్ తరపు న్యాయవాది తెలిపారు. ఈ సెషన్ నుంచి రాహుల్ పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతారని ఆయన తరపు న్యాయవాది పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత.. తీర్పు కాపీ లోక్‌సభ స్పీకర్ సచివాలయానికి వెళ్తుందని భావిస్తున్నారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ సభ్యత్వంపై లోక్‌సభ స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రాహుల్ పాల్గొనగలరని భావిస్తున్నారు.

రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో లోక్‌సభ(Lok Sabha) సెక్రటేరియట్ ఆయనపై అనర్హత వేటు వేసింది. అయితే వాయనాడ్‌లో ఎన్నికలను ఎన్నికల సంఘం ప్రకటించలేదు. ఈ విషయాన్ని స్పీకర్ ఎన్నికల సంఘానికి తెలియజేస్తారని.. ఆ తర్వాత స్పీకర్ ఈ విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు. అన్నీ త్వరగా జరిగితే రాహుల్.. సోమవారం నాడు పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనవచ్చు లేదా మంగళవారం జరిగే సమావేశాల్లో పాల్గొనవచ్చు.

ముఖ్యంగా ఆగస్టు 8-10 తేదీల్లో కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. ఇక రాహుల్ గాంధీ సభ్యత్వంపై లోక్ సభ స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అనుమతి రాగానే రాహుల్ సభకు వెళ్లనున్నారు. సోమ, మంగళవారాల్లో రాహుల్ లోక్ సభకు హాజరవుతారని విశ్వసనీయ సమాచారం. అవిశ్వాస తీర్మానంపై మంగళవారం సభలో చర్చ జరగనుంది. రాహుల్ సభ్యత్వంపై సోమవారంలోగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటే.. అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొనవచ్చు.

రాహుల్ గాంధీ శిక్షపై స్టే విధించడాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్ నేతలు బీజేపీపై విరుచుకుపడ్డారు. రాహుల్‌గాంధీ బావ రాబర్ట్ వాద్రా దీతీర్పును స్వాగతిస్తూ.. రాహుల్‌ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. అయితే ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామ‌ని పేర్కొన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాహుల్ గాంధీ పాల్గొంటారని ఆశిస్తున్నట్లు కాంగ్రెస్ నేత ఇమ్రాన్ ప్రతాప్‌ఘర్హి అన్నారు.

Updated On 4 Aug 2023 5:17 AM GMT
Ehatv

Ehatv

Next Story