రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల(electoral bonds) చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం(Supreme court) తీర్పు వెలువరించింది. ప్రాథమిక హక్కుల ఆర్టికల్ 19(1) (ఎ) ప్రకారం ఈ పథకం సమాచార హక్కును ఉల్లంఘిస్తుందని రాజ్యంగ ధర్మాసనం పేర్కొంది.

Supreme Court
రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల(electoral bonds) చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం(Supreme court) తీర్పు వెలువరించింది. ప్రాథమిక హక్కుల ఆర్టికల్ 19(1) (ఎ) ప్రకారం ఈ పథకం సమాచార హక్కును ఉల్లంఘిస్తుందని రాజ్యంగ ధర్మాసనం పేర్కొంది. నల్లధనాన్ని(Black money) అరికట్టేందుకు సమాచారహక్కును ఉల్లంఘించడం సమంజసం కాదని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ' ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధం. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. బ్లాక్ మనీ నిర్మూలనకు ఈ స్కీమ్ ఒక్కటే మార్గం కాదు. రాజకీయపార్టీలకు విరాళాలు అన్నది క్విడ్ ప్రోకోకు దారి తీస్తుంది. విరాళాలు ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉండటం కుదరదు. ఇది సమాచార హక్కు ఉల్లంఘన కిందకే వస్తుంది' అని ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు ఇచ్చింది.
