ఇండియన్ సివిల్ సెక్యూరిటీ కోడ్ (బీఎన్ఎస్ఎస్)లోని సెక్షన్ 184ను సవరించాలని కర్ణాటక హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.

ఇండియన్ సివిల్ సెక్యూరిటీ కోడ్ (బీఎన్ఎస్ఎస్)లోని సెక్షన్ 184ను సవరించాలని కర్ణాటక హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. అత్యాచార బాధితులను మహిళా వైద్యులు మాత్రమే పరీక్షించేలా చూడాలని కోర్టును అభ్యర్థించింది. ఇది వారి గోప్యత హక్కును కాపాడుతుందని అభ్యర్థన‌లో వెల్ల‌డించింది.

సవరణ చేసే వరకూ అత్యాచార బాధితులకు రిజిస్టర్డ్ మహిళా వైద్యుల పర్యవేక్షణలో వైద్య పరీక్షలు జరిగేలా చూడాలని హైకోర్టు సింగిల్ బెంచ్ జస్టిస్ ఎంజీ ఉమ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. అత్యాచార బాధితుల పట్ల సున్నితంగా వ్యవహరించాల్సిన ప్రాముఖ్యత గురించి పోలీసు అధికారులు, ప్రాసిక్యూటర్లు, వైద్యులు, వైద్య సిబ్బంది, న్యాయశాఖ అధికారులకు అవగాహన కల్పించాలని కోర్టు ఆదేశించింది.

అత్యాచారం, హత్యాయత్నం కేసులో నిందితుడైన అజయ్ కుమార్ భెరా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. నేరానికి భేరా కారణమని సాక్ష్యాలు చూపిస్తున్నాయని.. నేరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున అతని బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించినట్లు జస్టిస్ ఉమా తెలిపారు. ఒక పురుష వైద్యాధికారి బాధితురాలికి దాదాపు ఆరు గంటల పాటు ఎలాంటి వివరణ ఇవ్వ‌కుండా లేదా అభిప్రాయం చెప్పకుండానే వైద్య పరీక్షలు నిర్వహించారని కోర్టు పేర్కొంది. బాధితులకు స్నేహపూర్వక దర్యాప్తు అవసరమని నొక్కి చెబుతూ.. అత్యాచార బాధితులకు గోప్యత హక్కు ఉందని.. దానిని పోలీసులు, వైద్య సిబ్బంది తప్పనిసరిగా గౌరవించాలని కోర్టు పేర్కొంది.

Eha Tv

Eha Tv

Next Story