సీబీఐ(CBI), ఈడీలకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) బుధవారం బీజేపీని(BJP) టార్గెట్ చేశారు. సీబీఐ, ఈడీ పేరును బీజేపీ సేనగా మార్చాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ సంస్థలు బీజేపీకి రాజకీయ ఆయుధాలుగా మారాయని అన్నారు. దర్యాప్తు సంస్థలకు సంబంధించి సీఎం కేజ్రీవాల్ బుధవారం నాడు మాట్లాడుతూ..

సీబీఐ(CBI), ఈడీలకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) బుధవారం బీజేపీని(BJP) టార్గెట్ చేశారు. సీబీఐ, ఈడీ పేరును బీజేపీ సేనగా మార్చాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ సంస్థలు బీజేపీకి రాజకీయ ఆయుధాలుగా మారాయని అన్నారు. దర్యాప్తు సంస్థలకు సంబంధించి సీఎం కేజ్రీవాల్ బుధవారం నాడు మాట్లాడుతూ.. ఒక‌ప్పుడు దర్యాప్తు సంస్థలను గౌరవించే సమయం ఉండేదని ట్వీట్ చేశారు. వాళ్ళు ఎక్కడైనా రైడ్ చేసినప్పుడు, ఎవరినైనా అరెస్టు చేసినప్పుడు.. ఆ వ్యక్తి ఏదో తప్పు చేసి ఉంటాడని అనిపించేది. నేడు ఈ సంస్థలు బీజేపీకి రాజకీయ అస్త్రాలుగా మారాయని అన్నారు. సీబీఐ(CBI), ఈడీ(ED) పేరును "బిజెపి సేన"గా(BJP Sena) మార్చాలి. దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. తమిళనాడు(Tamilnadu) విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీపై(Senthil Balaji) ఈడీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయ పగతో గుడ్డిలో కూరుకుపోయిన బీజేపీ.. మన ప్రజాస్వామ్యానికి తీరని నష్టం కలిగిస్తోందన్నారు.

Updated On 14 Jun 2023 7:04 AM GMT
Ehatv

Ehatv

Next Story