యూజీసీ నెట్ పేపర్ లీక్.. పరీక్ష రద్దు..
నీట్ యూజీ పరీక్ష(NET UGC) నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని, ప్రశ్నాపత్రం లీక్(Paper Leak) అయ్యిందని, అనేక అక్రమాలు జరగాయని దేశం మొత్తం దుమారం రేగుతోంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. ఇలాంటి సమయంలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన జీసీ-నెట్ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-జాతీయ అర్హత పరీక్ష)ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసింది. నెట్ పరీక్షలో చాలా అవకతవకలు జరిగినట్టు తెలిసిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఎన్‌టిఏ(NTA) ప్రకటించింది. పరీక్ష ప్రక్రియలో పారదర్శకత, పవిత్రతను కాపాడేందుకు కేంద్ర విద్యా శాఖ ఈ నిర్ణయం తీసుకొన్నదని ఎన్‌టిఏ తెలిపింది. మళ్లీ పరీక్షను నిర్వహిస్తామని, ఎప్పుడనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామని ఎన్‌టిఎ ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు నెట్ పరీక్షలో అవకతవకల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తుందని చెప్పింది. యూజీసీ-నెట్ పరీక్షను మంగళవారం దేశవ్యాప్తంగా 317 నగరాల్లోని 1205 సెంటర్లలో నిర్వహించారు. ఈ పరీక్షకు 9 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు.