మహారాష్ట్రలో మహా వికాస్ అఘాది(Maha Vikas Aghadi) కూటమిలో సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇందులో మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే సారథ్యంలోని శివసేన పార్టీ 20 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుంది.
మహారాష్ట్రలో మహా వికాస్ అఘాది(Maha Vikas Aghadi) కూటమిలో సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇందులో మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే సారథ్యంలోని శివసేన పార్టీ 20 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. కాంగ్రెస్(Congress) పార్టీ 18 స్థానాల్లో బరిలో దిగబోతున్నది. శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీకి పది స్థానాలు కేటాయించారు. వంచిత్ బహుజన్ అఘాది పార్టీకి రెండు సీట్లు ఇచ్చారు. సీట్ల పంపిణిపై పూర్తి స్థాయిలో డీల్ కుదిరిందా లేదా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో అధికార ప్రకటన రావచ్చు.