భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్ ధోనీ(Dhoni) వేసిన కోర్టుధిక్కారణ కేసులో ఓ ఐపీఎస్‌(IPS) అధికారికి 15 రోజుల జైలుశిక్ష పడింది. 2013లో ఓ టీవీ డిబేట్‌లో ఫిక్సింగ్‌ ఆరోపణల గురించి ప్రస్తావిస్తూ తనకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఐపీఎస్‌ అధికారి సంపత్‌కుమార్‌తో(Sampath Kumar) పాటు జీ మీడియా కార్పొరేషన్‌పై 2014లో ధోనీ మద్రాస్‌ హైకోర్టులో(Madras High court) కేసు వేశారు. తన పరువుకు నష్టం కలిగించారని 100 కోట్ల పరిహారం ఇచ్చేలా ఆదేశించాలని ఆయన కోరారు.

భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్ ధోనీ(Dhoni) వేసిన కోర్టుధిక్కారణ కేసులో ఓ ఐపీఎస్‌(IPS) అధికారికి 15 రోజుల జైలుశిక్ష పడింది. 2013లో ఓ టీవీ డిబేట్‌లో ఫిక్సింగ్‌ ఆరోపణల గురించి ప్రస్తావిస్తూ తనకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఐపీఎస్‌ అధికారి సంపత్‌కుమార్‌తో(Sampath Kumar) పాటు జీ మీడియా కార్పొరేషన్‌పై 2014లో ధోనీ మద్రాస్‌ హైకోర్టులో(Madras High court) కేసు వేశారు. తన పరువుకు నష్టం కలిగించారని 100 కోట్ల పరిహారం ఇచ్చేలా ఆదేశించాలని ఆయన కోరారు. ఈ కేసులో తన తరపున నుంచి వివరణ ఇవ్వకపోవడంతో కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని మరోసారి ధోనీ పిటిషన్‌ వేశారు. దీనిపై జస్టిస్ ఎస్.ఎస్.సుందర్‌(Justice SS Sunder), జస్టిస్‌ సుందర్‌ మోహన్‌(Justice Sunder Mohan) విచారించారు. తగిన వివరణ ఇవ్వని కారణంగా ఐపీఎస్‌ అధికారికి 15 రోజులపాటు శిక్ష విధించారు. అయితే ఈ శిక్ష అమలును వెంటనే చేపట్టకూడదని ఐపీఎస్ అధికారి సంపత్‌కుమార్‌ న్యాయవాది కోరగా అందుకు న్యాయమూర్తులు అంగీకరించారు. శిక్షపై అప్పీలు చేసుకునేందుకు 30 రోజుల సమయం ఇచ్చారు.

Updated On 16 Dec 2023 2:17 AM GMT
Ehatv

Ehatv

Next Story