భారతదేశంలోని(India) అతి పొడవైన సముద్ర వంతెన(Bridge) ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL)ను ప్రధాని మోడీ(PM Modi) ప్రారంభించారు. ఈ వంతెనకు 'అటల్ సేతు'(Atal Sethu) అని మాజీ ప్రధాని వాజ్‌పేయి(Vajpayee) పేరును పెట్టారు.
భారతదేశంలోని(India) అతి పొడవైన సముద్ర వంతెన(Bridge) ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL)ను ప్రధాని మోడీ(PM Modi) ప్రారంభించారు. ఈ వంతెనకు 'అటల్ సేతు'(Atal Sethu) అని మాజీ ప్రధాని వాజ్‌పేయి(Vajpayee) పేరును పెట్టారు. ఆరు లేన్లతో 21.8 కి.మీ.పొడవుతో ఈ వంతెనను నిర్మించారు. ఇందుకోసం రూ.18 వేల కోట్లు ఖర్చుచేశారు. దాదాపు రెండు గంటల ప్రయణానికి 15-20 నిమిషాల్లోనే గమ్యస్థానాలకు చేరుకునే ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ప్రపంచంలో ఇది 12వ అతిపెద్ద సముద్రపు బ్రిడ్జిగా నిలిచింది.
ఈ వంతెన పొడవు 21.8 కి.మీ ఉండగా ముంబైలోని సెవ్రి, రాయ్‌గఢ్ జిల్లా నవీ ముంబైలోని న్హవా షెవా ప్రాంతాన్ని కలుపుతుంది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రకారం, 2018 మధ్యలో పని ప్రారంభించినప్పటి నుంచి ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం 5,403 మంది కార్మికులు, ఇంజనీర్లు ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి పనిచేశారు. ఈ ఇంజినీరింగ్ అద్భుతాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు, ఇంజనీర్లు ఈ ప్రాజెక్ట్‌లో పని చేయగా, చాలా మంది కార్మికులు బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి వచ్చి ఈ పనుల్లో పాల్గొన్నారు. ఈ వంతెన నిర్మాణ సమయంలో దురదృష్టవశాత్తులో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ వంతెనకు సంబంధించిన వీడియో ఒకటి ముంబైలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.