కపిలవస్తు(kapilavastu)దేశానికి మహారాజైన శుద్ధోధనుడు(Suddhodhana)-మాయదేవి(Mayadevi) దంపతుల ముద్దు బిడ్డ సిద్ధార్థుడు(Siddhartha). సిద్ధార్థుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు మాయాదేవి ఓ కల కంటుంది. ఆరు దంతాలున్న(Ivory) ఓ ఏనుగు తన గర్భములోనికి కుడివైపు నుంచి ప్రవేశించినట్టుగా ఆమెకు కల వస్తుంది.

కపిలవస్తు(kapilavastu)దేశానికి మహారాజైన శుద్ధోధనుడు(Suddhodhana)-మాయదేవి(Mayadevi) దంపతుల ముద్దు బిడ్డ సిద్ధార్థుడు(Siddhartha). సిద్ధార్థుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు మాయాదేవి ఓ కల కంటుంది. ఆరు దంతాలున్న(Ivory) ఓ ఏనుగు తన గర్భములోనికి కుడివైపు నుంచి ప్రవేశించినట్టుగా ఆమెకు కల వస్తుంది. తొలి పురుడు పుట్టింట్లోనే జరగాలన్నది శాక్యవంశ(shakya vamsam) ఆచారం. గర్భవతిగా ఉన్న మాయాదేవి ప్రసవానికి ముందు తల్లిగారింటికి బయలుదేరుతుంది.

మార్గమధ్యంలో లుంబిని(Lumibini) అనే ప్రాంతంలో ఆమెకు నొప్పులు వస్తాయి. అక్కడే ఓ సాల వృక్షం(Sala tree) కింద ఆమె మగబిడ్డకు జన్మనిస్తుంది. బిడ్డ పుట్టిన కొన్ని రోజులకే మాయాదేవి కన్నుమూస్తుంది. సిద్ధార్థుండంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించేవాడని అర్థం. ఆ సిద్ధార్థుడే గౌతమ బుద్ధుడు(Gautham buddha)..

భారత-నేపాల్‌(bharath-nepal) సరిహద్దు ప్రాంతంలో లుంబిని క్షేత్రం ఉంది. అచ్చంగా చెప్పాలంటే నేపాల్‌లోని రూపాందేహి(rupandehi) జిల్లాలో ఉంది. ఇక్కడే మాయాదేవి గర్భాన గౌతమ బుద్ధుడు జన్మించాడు. హిమాలయ పర్వతపాద ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రం బుద్ధుడు విద్యాబుద్ధులు నేర్చుకున్న కపిలవస్తుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. లుంబిని ఇప్పుడో స్మాకరక కేంద్రం.

బౌద్ధులకు పుణ్యస్థలి. లుంబినిలో ఓ పెద్ద వనం. ఓ పుష్కరిణి. తల్లి మాయాదేవి పేరున ఉన్న పెద్ద దేవాలయం ఉన్నాయి. 1896లో ఆర్కియాలజీ అధికారులు లుంబిని ప్రాంతాన్ని గుర్తించారు. మౌర్య చక్రవర్తి(Maurya) అశోకుడు(ashoka) లుంబినిని సందర్శించాడనడానికి ఆధారాలు కనుగొన్నారు. 1997లో లుంబిని క్షేత్రాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. బౌద్ధమత విభాగాలైన మహాయాన(mahayana), వజ్రయాన(vajrayana) ఆశ్రమాలు ఇక్కడ ఉన్నాయి.

మన దగ్గర బుద్ధునికి సంబంధించిన ఎన్నో చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి.. బుద్ధుడు నిర్వాణం చెందిన కుషీ నగరం మన దేశంలోనే ఉంది. బౌద్ధ జాతక కథల్లో కుషీనగర్‌ను కుషావతి అన్నారు. ప్రాచీన భారతంలో మల్లరాజ్యానికి కుషావతి కేంద్రం. హిరణ్యావతి నది తీరంలో ఉన్న కుషావతి కాలక్రమంలో కుషానారాగా మారింది.. ఇప్పుడు కుషీనగర్‌ అయ్యింది.. అశోకుడి పాలనలో ఇక్కడ ఎన్నో కట్టడాలు నిర్మితమయ్యాయి. గౌతముడు బోధి వృక్షం కింద జ్ఞానాన్ని సముపార్జించిన ప్రాంతమే బోధ్‌ గయా! మనమేమో బుద్ధగయ అంటాం.

చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక బౌద్ధ ఆశ్రమాలు ఉన్నాయి. ఇక్కడున్న ప్రధాన ఆశ్రమాన్ని బోధిమానంద విహారగా పిలుచుకుంటారు. మహాబోధి ఆలయం అని కూడా అంటారు. మహాబోధి ఆలయాన్ని ఆశోకుడు కట్టించాడంటారు కొందరు. మరికొందరేమో ఒకటో శతాబ్దంలో కుషాణులు నిర్మించారంటారు.. బోధి వృక్షం కింద మూడు పగళ్లు.. మూడు రాత్రులు గౌతముడు ధ్యానం చేశాడు. జ్ఞానాన్ని పొందాడు. బుద్ధుడయ్యాడు. బుద్ధగయ ఫల్గు నది తీరంలో ఉంది.

పాట్నాకు 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుద్ధ గయలో నేపాల్‌, భూటాన్‌, టిబెట్‌, చైనా, జపాన్‌, మయన్మార్‌, శ్రీలంక, థాయ్‌లాండ్‌, వియత్నాంలకు చెందిన బౌద్ధ ఆశ్రమాలు ఉన్నాయి. 2002లో బుద్ధగయను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో ప్రకటించింది. ఇక్కడ బుద్ధపూర్ణమ వేడుకలు చాలా గొప్పగా జరుగుతాయి.

తథాగతుడు తొలిసారి ధర్మప్రబోధన చేసిన పవిత్ర ప్రాంతం సారనాథ్‌. ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వారణాసికి ఇది కేవలం 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదో జింకలవనం. బౌద్ధమతస్తులు సందర్శించి తీరవలసిన క్షేత్రం ఇది! గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం తర్వాత అయిదు వారాలకు బోధగయ నుంచి సారనాథ్‌కు వెళ్లాడు. సారనాథ్‌ అప్పట్లో ఉసీనగరం. తన సహచరులైన అయిదుగురు సాధువులకు బుద్ధుడు ధర్మోపదేశం చేసినప్పుడు సంఘం అవిర్భవించింది. మొదటి బోధను ధర్మచక్ర పరివర్తన సూత్రం అంటారు.

Updated On 5 May 2023 2:05 AM GMT
Ehatv

Ehatv

Next Story