✕
Pregnancy Tourism : గర్బం కోసం లడ్ఢాఖ్ వస్తున్న విదేశీ మహిళలు..:
By EhatvPublished on 1 Dec 2023 2:28 AM GMT
లద్దాఖ్‌లోని(Ladakh) సింధూనది(Sindhu river) ఒడ్డున బ్రోక్పా(Brokpa) జాతికి చెందిన 5 వేల మంది నివాసం ఉంటున్నారు. వీరు తాము చిట్ట చివరి స్వచ్ఛమైన ఆర్యులుగా(Aryans) ప్రచారం చేసుకుంటారు. బియామా(Beama), దాహ్(Dah), హానూ(Hanu), దార్చిక్(Darchik) గ్రామాల్లో ఈ బ్రోక్పా జాతి ఉంటుంది. ఆర్యులని ప్రచారం చేసుకోవడంతో వీరిపై కొందరికి ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో ఇంటర్నెట్లో(Internet) ఈ బ్రోక్పా కమ్యూనిటీ గురించి వెతకడం ప్రారంభమైంది. ఈ బ్రోక్పా ప్రజలు స్వచ్ఛమైన ఆర్యలని పలువురు విశ్వసిస్తున్నారు. దీంతో వీరితో ప్రెగ్నెన్సీ కోసం విదేశీయులు ఈ బ్రోక్పా ప్రజలు ఉండే ప్రాంతానికి వస్తున్నారని అంటున్నారు.

x
tourism
-
- ఓ దుకాణాదారుడికి బంపరాఫర్..! ఈ బ్రోక్పా ప్రజలు స్వచ్ఛమైన ఆర్యలని పలువురు విశ్వసిస్తున్నారు. వారితో శృంగారంలో(Romance) పాల్గొని స్వచ్ఛమైన ఆర్యులకు జన్మనివ్వాలని కలలు కంటున్న మహిళలు గర్భం దాల్చేందుకు వచ్చి వెళ్తున్నారని స్థానికులు చెప్తున్నారు. 2007లో సంజీవ్ శివన్(Sanjeev shivan) తీసిన 'ది ఆచ్టంగ్ బేబీ(Achtung Baby)... ఇన్ సెర్చ్ ఆఫ్ ప్యూరిటీ’ అనే డాక్యుమెంటరీలో జర్మనీకి చెందిన ఓ మహిళ లద్దాఖ్ వచ్చి.. ఇక్కడి వ్యక్తి సాయంతో గర్భం దాల్చినట్లు చెప్తారు. అయితే బ్రోక్పా జాతి ప్రజలు ఈ విషయాలను వివరించడానికి ఇష్టపడరు. ఈ వార్తలతో తమకు చెడు పేరు వస్తుందని భావిస్తున్నారు. ఓ దుకాణాదారుడు దీనిపై వివరిస్తూ.. కొన్నేళ్ల కిందట జర్మనీ(Germany) నుంచి వచ్చిన ఓ మహిళతో శృంగారంలో పాల్గొన్నానని తెలిపాడు. గర్భం దాల్చేందుకు జర్మనీ నుంచి వచ్చిందని.. అందుకు తనను ఎంచుకుందని.. దీంతో లేహ్‌లోని ఓ హోటల్లో(Hotel) చాలా రోజులు ఆ మహిళతో గడిపానని దుకాణాదారుడు వివరించారు. గర్బం దాల్చిన తర్వాత జర్మనీ వెళ్లిపోయిందని, తర్వాత కొన్నేళ్ల తర్వాత ఆ బిడ్డను తీసుకొని తనను కలిసేందుకు వచ్చిందని వివరించారు.
-
- ఆర్యులకు అసలు రూపం మాదే..! అసలు ఆర్యులు అందంగా(Beautifully), పొడుగ్గా ఉంటారని.. మావాళ్ల అందరిలోనూ ఆ లక్షణాలు కనిపిస్తాయని ఓ బ్రోక్పా యువతి చెప్పుకొచ్చింది. అంతేకాదు మేం ఆర్యులకు ఉండాల్సిన లక్షణాలన్నీ మాకు ఉంటాయని, ప్రకృతిని(Nature) పూజిస్తామని.. మేమే స్వచ్ఛమైన ఆర్యులని నిరూపించేందుకు ఇదే సాక్ష్యమని ఆ యువతి చెప్పుకొచ్చారు.
-
- ఇతర దేశాల నుంచి భారత్‌కు ఆర్యులు..! బియామా, గార్కొనే దార్చిక్ దాహ్, హానూ గ్రామాల్లో వీరి మొఖాలు చాలా భిన్నాంగా ఉంటాయి. ఆర్యులు ఇతర దేశాల నుంచే భారత్‌కు(Bharat) వచ్చారని ఈ మధ్యే బయటపెట్టిన డీఎన్ఏ(DNA) పరిశోధనల్లో వెల్లడైంది. వీరి ఆచార వ్యవహారాల్లో వైదిక సంస్కృతి(Vaidik culture) ప్రభావం కనిపిస్తుందని చాలా మంది పరిశోధకులు కూడా అంగీకరిస్తున్నారు. బ్రోక్పాలు తమ సంస్కృతిని వైదిక సంస్కృతిని పోల ఉంటుందని చెప్తున్నారు. తమ భాషపై కూడా సంస్కృత(Sanskrit) భాష ప్రభావం ఉంటుందని అంటున్నారు. మేం సూర్యుడిని(Sun) సూర్య్, గుర్రాన్ని(Horse) అశ్వ్ అంటామని ఇది సంస్కృతానికి దగ్గరగా ఉంటుందని బ్రోక్పా జాతికి చెందిన స్వాంగ్ అనే వ్యక్తి. ఇతను బ్రోక్పా జాతీయులపై పలు పరిశోధనలు జరుపుతున్నారు.
-
- చరిత్ర ఏం చెప్తోంది..? ఇక చరిత్రకారుల(Historians) విషయానకి వస్తే.. కొందరు తమని అలెగ్జాండర్ ద గ్రేట్(Alexander the Great) వారసులమని చెప్పుకుంటున్నారు. ఫ్రెంకీ అనే చరిత్రకారుడు.. తన పుస్తకంలో మేం నివసించే దర్ద్ అనే ప్రాంతం ఆర్యన్ స్టాక్ అని అభివర్ణించారు. మరోవైపు పాక్ ఆక్రమిత కశ్మీర్లో(POK) ఉండే కలాష్(Kalash) తెగ ప్రజలు, హిమాచల్‌ప్రదేశ్‌లో(Himachal pradesh)ని మలానా, బడాభాంగల్ గ్రామాల ప్రజలు కూడా తాము అలెగ్జాండర్ వారసులని చెప్పుకుంటున్నారు. బ్రోక్పాల జానపదాలను పరిశీలిస్తే వాళ్ల పూర్వీకులు ఏడో శతాబ్దంలో(7th Centuary) పశ్చిమ హిమాలయాల(Himalayas) నుంచి గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతానికి వచ్చినట్లు చరిత్ర చెప్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతం పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉంది.
-
- పంట కోతల పండగలు..! అంతేకాకుండా ఈ బ్రోక్పా తెగ ప్రజలు ప్రతి ఏటా పంట కోతల(Crop yielding) పండగలు నిర్వహిస్తారు. బ్రోక్పాలు స్థిరపడిన ప్రాంతాల్లో ఒక్కో గ్రామంలో ఒక్కో ఏడాది ఈ వేడుకలు జరుపుకుంటారు. ఈ తెగలో అధికశాతం వ్యవసాయంపై(Agriculture) ఆధారపడే జీవిస్తున్నారు. టెక్నాలజీ(Technology) పెరగడంతో మెల్లిమెల్లిగా వీరి జీవనశైలి కూడా మారుతుందంటున్నారు. సెల్ఫోన్ల(Cell phones) రాకతో సరిహద్దుల్లో ఉన్న తమ జాతివారితో మాట్లాడుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
-
- ఉద్యోగాల పరిస్థితి ఏంటి..? ఈ తెగకు చెందినవారు ఉద్యోగాల(Employment) కోసం పట్నాలు(Cities) వెళ్తారా అంటే మిశ్రమ సమాధానాలు వస్తున్నాయి. అయితే ఉద్యోగాల కోసం తమ గుర్తింపును (Identity)వదులుకోలేమంటున్నారు ఈ బ్రోక్పా జాతికి చెందిన వ్యక్తులు.
-
- ఆర్యులపై ప్రేమతో గర్భం కోసం వస్తున్నారు..! దేశవిదేశాల్లో ఉండే ఆర్యుల వారసులమని చెప్పుకొనే కొందరు మహిళలు(Women).. ఇక్కడి బ్రోక్పా వ్యక్తులతో గర్భం(Pregency) తెచ్చుకునేందుకు వచ్చి వెళ్తున్నారని సమాచారం.

Ehatv
Next Story