ఎలాగైనా సరే మత విద్వేషాలు రెచ్చగొట్టేసి ఓట్లు దండుకోవాలన్నది కొన్ని పార్టీల ప్రధాన లక్ష్యం. ఇలాగే అధికారంలోకి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ది కేరళ స్టోరీస్‌(The Kerala Protest) సినిమాతో కూడా ఆ రకమైన విద్వేషాలు రెచ్చగొట్టాలనుకుంటోంది.

ఎలాగైనా సరే మత విద్వేషాలు రెచ్చగొట్టేసి ఓట్లు దండుకోవాలన్నది కొన్ని పార్టీల ప్రధాన లక్ష్యం. ఇలాగే అధికారంలోకి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ది కేరళ స్టోరీస్‌(The Kerala Protest) సినిమాతో కూడా ఆ రకమైన విద్వేషాలు రెచ్చగొట్టాలనుకుంటోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ సినిమాపైనే వాదోపవాదాలు జరుగుతున్నాయి.

కొన్ని రాష్ట్రాలు ఈ సినిమాను విడుదల చేయాలా? వద్దా? అన్న మీమాంసలో(Confusion) ఉన్నాయి. కేరళలోని బీజేపీయేతర(BJP) పార్టీలన్నీ ఈ సినిమాను నిషేధించాలని పట్టుబడుతున్నాయి. పక్కనే ఉన్న తమిళనాడులో(Tamil Nadu) కూడా ఇదే పరిస్థితి. తమిళనాడులో ది కేరళ స్టోరీస్‌ సినిమా విడుదల అయితే మాత్రం పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతాయని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

ఏప్రిల్‌ 6వ తేదీన ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచి తీవ్రమైన చర్చ జరుగుతోంది. సినిమాను యథార్థ సంఘటనల ఆధారంగా తీశామని, ఇప్పటి వరకు కేరళలో 32 వేల మంది అమ్మాయిలు మతం మారినట్టు నిర్మాత, దర్శకులు చెబుతున్నారు. మొదట ఈ మాట అన్నారు కానీ ఇప్పుడు మాట మార్చారు.

సెన్సార్‌(Censor) పూర్తయిన ఈ సినిమా ఈ శుక్రవారం దేశవ్యాప్తంగా విడుదల కానుంది. సినిమాను నిషేధించాలని సుప్రీంకోర్టులో(Supreme court) కేసు కూడా దాఖలయ్యింది. అయితే సుప్రీం ఇందుకు నో చెప్పింది. తమిళనాడులో ఈ సినిమా విడుదలైతే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతాయని రాష్ట్ర పోలీసుశాఖను నిఘా వర్గాలు హెచ్చరించాయి.

శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని, అప్రమత్తంగా ఉండటం అవసరమని తెలిపింది. రాష్ట్రంలో సినిమా విడుదల కాకుండా చూస్తే మంచిదని తెలిపింది. మరి స్టాలిన్(Stalin) ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Updated On 4 May 2023 1:28 AM GMT
Ehatv

Ehatv

Next Story