ఓ హిందూ యువకుడు, ముస్లీం యువతి వివాహాన్ని కొద్ది రోజుల క్రితం కేరళ పోలీసులు(Kerala Police) అడ్డుకున్నారు. అయితే ఆ జంట ఈ రోజు వివాహం చేసుకున్నారు. అల్ఫియా (18), అఖిల్ (21)లు జూన్ 17న కేరళలోని తిరువనంతపురంలోని ఒక దేవాలయంలో వివాహం చేసుకోవాలనుకున్నారు. అయితే ఈ మతాంతర వివాహాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారింది. వీడియోలో పోలీసులు అల్ఫియాను లాగినట్లు కనిపిస్తుంది. పోలీసు సిబ్బంది తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని అల్ఫియా ఆరోపించింది. ఆ తర్వాత అఖిల్, అల్ఫియా ఇద్దరి కుటుంబాలు ఈ పెళ్లిని వ్యతిరేకించారు. అల్ఫియా కుటుంబ సభ్యులు కాయంకుళం పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే జూన్ 16న ఇంటి నుంచి వెళ్లిన అల్ఫియా.. తన ఇష్టానుసారం ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కోవలం పోలీసులకు సమాచారం అందించింది. ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటే.. అల్ఫియాను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. అల్ఫియా పోలీసులకు సహకరించకపోవడంతో బలవంతంగా తీసుకెళ్లాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.