కేరళను మరోసారి నిఫా వైరస్‌(Nipha Virus) వణికిస్తోంది. అయిదేళ్ల కిందట ఇదే రాష్ట్రంలో వెలుగు చూసిన నిఫా వైరస్‌ కనుమరుగైనట్టే కనిపించింది. మళ్లీ ఇప్పుడు విజృంభిస్తోంది. ముఖ్యంగా కోజికోడ్‌(Kozhikode) జిల్లాలో వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. అందుకే జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్‌ జారీ చేసింది ప్రభుత్వం. ఇప్పటికే ఈ జిల్లాలో నిఫా వైరస్‌ కారణంగా ఇద్దరు చనిపోయారు. మరణించిన వారితో సన్నిహితంగా ఉన్నవారితో పాటు మొత్తం 130 మంది రక్త నమూనాలను సేకరించారు. వాటిని పూణెలోని వైరాలజీ ల్యాబ్‌కు(Virology Lab) పంపించారు.

కేరళను మరోసారి నిఫా వైరస్‌(Nipha Virus) వణికిస్తోంది. అయిదేళ్ల కిందట ఇదే రాష్ట్రంలో వెలుగు చూసిన నిఫా వైరస్‌ కనుమరుగైనట్టే కనిపించింది. మళ్లీ ఇప్పుడు విజృంభిస్తోంది. ముఖ్యంగా కోజికోడ్‌(Kozhikode) జిల్లాలో వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. అందుకే జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్‌ జారీ చేసింది ప్రభుత్వం. ఇప్పటికే ఈ జిల్లాలో నిఫా వైరస్‌ కారణంగా ఇద్దరు చనిపోయారు. మరణించిన వారితో సన్నిహితంగా ఉన్నవారితో పాటు మొత్తం 130 మంది రక్త నమూనాలను సేకరించారు. వాటిని పూణెలోని వైరాలజీ ల్యాబ్‌కు(Virology Lab) పంపించారు. కోజికోడ్‌లో ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డును(Isolation ward) ఏర్పాటు చేశారు వైద్య నిపుణులు. మరోవైపు జిల్లాలోని తిరువళ్లూరు, కుట్టియేడి, కయక్కోడి, విల్లయపల్లి, కవిలుంపర, అయన్‌చేరి, మరుతోంకర పంచాయితీలను కంటైన్‌మెంట్‌ జోన్‌లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఆ గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను, కార్యాలయాలను అధికారులు ఇప్పటికే మూసివేశారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. అదేవిధంగా నిఫా వైరస్‌ హెచ్చరికల నేపథ్యంలో పూణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ బృందాలు కేరళకు చేరుకున్నాయి.
దక్షిణ భారతంలో మొదటిసారిగా నిఫా వైరస్‌ బయటపడింది కోజికోడ్‌ జిల్లాలోనే! 2018, మే 19వ తేదీన మొదటి కేసు వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్‌ కారణంగా 2018, 2021లలో చాలా మంది మరణించారు. జంతువుల నుంచి ఈ వైరస్‌ మనుషులకు సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది. ఈ వ్యాధి బారిన పడిన వారి నుంచి ఇది నేరుగా మరో వ్యక్తికి సంక్రమిస్తుంది. ముఖ్యంగా తుంపర్లు, ముక్కు నుంచి, నోటి నుంచి వచ్చే ద్రవాల ద్వారా నిఫా వైరస్‌ సోకుతుంది. ఈ వైరస్‌ లక్షణాలు తొందరగా బయటపడవు. ఈ వైరస్‌ సోకిన వారిలో కొందరికి మెదడువాపు వ్యాధి వస్తుంది. ఒక్కసారి ఈ వైరస్‌ మన ఒంట్లోకి చేరిందంటే తొమ్మిది రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాలలో నాలుగైదు రోజుల్లోనే లక్షణాలు బయటకు వస్తాయి. నిఫా వైరస్‌ సోకిన వారికి జ్వరం, తలనొప్పి, దగ్గు వస్తాయి. శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. తీవ్రమైన అలసట ఉంటుంది. వైరస్‌ సోకిన వారిలో దాదాపు 75 శాతం మంది చనిపోయే ఛాన్సు ఉంది. ఈ వ్యాధికి ఇప్పటి వరకు ప్రత్యేక మందులు లేవు. కాబట్టి మాస్క్‌లు పెట్టుకోవడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి నియమాలు పాటించాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

Updated On 13 Sep 2023 5:13 AM GMT
Ehatv

Ehatv

Next Story