కోవిడ్ న్యూ వేరియెంట్ జేఎన్.1 (JN.1 ) పై ఆరోగ్యశాఖ (Health dept) అధికారులుఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నాలుగు వారాల్లో ఈ జేఎన్.1 వేరియెంట్ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జనవరి మొదటి వారంలో ఈ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని జేఎన్.1పై ఇన్సాకాగ్ (INSACOG) నివేదిక వెల్లడించింది.

ఇప్పటికే ఈ వేరియెంట్ కేసులు ఏడు రాష్ట్రాల్లో నమోదవడంతో కేంద్ర ఆరోగ్య శాఖ.. ఆయా రాష్ట్రాల అధికారులను అప్రమత్తం చేసింది. కేరళ, గోవా, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌లో, తెలంగాణలో జెఎన్.1 కేసులు నమోదయ్యాయి. రాజస్తాన్‌లోని ఐదుగురి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా జేఎన్.1 వేరియెంట్ నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు దేశంలో 69 కేసులు జేఎన్.1 ఉండగా అత్యధికంగా గోవాలో 34 మందికి, కర్నాటకలో 8 మందికి, కేరళలో ఆరుగురికి, మహారాష్ట్రంలో 9 మందికి, రాజస్తాన్‌లో ఐదుగురికి, తమిళనాడులో నలుగురికి, తెలంగాణలో ఒక్కరికి జేఎన్.1 పాజిటివ్ వచ్చింది. న్యూఇయర్ (New Year) వేడుకల తర్వాత ఇది మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని అంటున్నారు. జనవరి మొదటి వారం నుంచి మూడు వారాలపాటు ఇది విస్తరించే అవకాశం ఉందని.. గత ఏడాది కూడా ఒమిక్రాన్ (Omicron)వేరియెంట్ డిసెంబర్-జనవరి మధ్యే అధికంగా ఉండి ఫిబ్రవరి నుంచి తగ్గుముఖం పట్టిందని.. ఈ జేఎన్.1 కూడా ఇలాగే కొనసాగే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ అంచనాలు వేస్తోంది. ఫిబ్రవరిలో ఇది బలహీనపడే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. గుంపులు, గుంపుల సముదాయాలకు దూరంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకుంటే జేఎన్.1 ప్రమాదాన్ని నివారించవచ్చని సూచిస్తున్నారు.