కార్తికంలో(Karthika Masam) వచ్చే శుక్లపక్ష ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి(Dwadashini Ksheerabdi Dwadashi), పావన ద్వాదశి(Pavana Dwadashi), చిలుకు ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి వంటి పేర్లతో పిలుస్తారు. అమృతం కోసం దేవతలు దానవులు క్షీరసాగరాన్ని చిలకడం మొదలు పెట్టిన రోజు కాబట్టే ఈ మాస శుక్లపక్ష ద్వాదశికి చిలుకు ద్వాదశి అని పేరు. బృందా ద్వాదశి అని కూడా అంటారు. బృంద అంటే తులసి(Tulasi).

Dwadasi Ksheerabdi Dwadasi
కార్తికంలో(Karthika Masam) వచ్చే శుక్లపక్ష ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి(Dwadashini Ksheerabdi Dwadashi), పావన ద్వాదశి(Pavana Dwadashi), చిలుకు ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి వంటి పేర్లతో పిలుస్తారు. అమృతం కోసం దేవతలు దానవులు క్షీరసాగరాన్ని చిలకడం మొదలు పెట్టిన రోజు కాబట్టే ఈ మాస శుక్లపక్ష ద్వాదశికి చిలుకు ద్వాదశి అని పేరు. బృందా ద్వాదశి అని కూడా అంటారు. బృంద అంటే తులసి(Tulasi). యోగులూ, మునులూ తమ చాతుర్మాస దీక్షను విరమించే పవిత్ర తిథి కూడా ఇదే. ఆ రోజునే విష్ణుమూర్తి-తులసిలకు కల్యాణాన్ని జరిపించి దీపాలను వెలిగిస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన మహావిష్ణువు కార్తిక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొని ద్వాదశి నాడు లక్ష్మీదేవిని పరిణయమాడతాడని విష్ణు పురాణం(Vishnu Puranam) పేర్కొంటోంది. అందుకే ద్వాదశినాడు సాయంత్రం తులసిని లక్ష్మీదేవిగా అలంకరించి, ఉసిరిచెట్టును శ్రీమన్నారాయణుడిగా భావించి కల్యాణం జరిపించి, దీపాలతో అలంకరిస్తారు. కార్తీక మాసంలో కమలాక్షుడైన శ్రీహరిని కమతాలతో పూజించే వారి ఇంట కమలవాసినియైన మహాలక్ష్మి స్థిరంగా వుంటుందట! శ్రీహరిని తులసీదళాలతో, జాజిపూలతో పూజించిన వారికి పునర్జన్మ వుండదట!
తిరుమలలో(Tirumala) శ్రీవారి సేవలో దీనికో విశిష్టత ఉంది. ఏటా కార్తిక శుద్ధ ద్వాదశి అంటే ఇవాళ నిర్వహించే వేడుకను కైశిక ద్వాదశి అంటారు. శ్రీదేవి భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాసమూర్తి తిరువీధులో ఊరేగుతారు. ఏడాదిలో రెండుసార్లు మాత్రమే అంటే క్షీరాబ్ది ద్వాదశి, ముక్కోటి ద్వాదశి వేకువ జామున గర్భాలయం దాటి నాలుగు మాడవీధుల్లో ఊరేగి సూర్యోదయానికి ముందే ఆలయానికి చేరుకుంటారు. సూర్యకిరణాలు సోకితే ఉగ్రత్వం వస్తుందంటారు.
