జీ 20(G-20) సదస్సు కోసం తరలివచ్చిన వివిధ దేశాల అధినేతలకు భారత్‌ బ్రహ్మండమైన ఆతిథ్యాన్ని ఇస్తున్నది. అతిథిదేవోభవ అన్నారు కదా! ఆ మాత్రం ఉండాల్సిందే! కాకపోతే తాహతుకు మించి చేస్తేనే విమర్శలు వస్తాయి. ఇప్పుడు భారత ప్రభుత్వం అదే చేస్తున్నది. దేశాధినేతల గౌరవార్థం ఇస్తున్న విందులో బంగారు(Gold), వెండి(Silver) పాత్రలను ఉపయోగిస్తుండంపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జీ 20(G-20) సదస్సు కోసం తరలివచ్చిన వివిధ దేశాల అధినేతలకు భారత్‌ బ్రహ్మండమైన ఆతిథ్యాన్ని ఇస్తున్నది. అతిథిదేవోభవ అన్నారు కదా! ఆ మాత్రం ఉండాల్సిందే! కాకపోతే తాహతుకు మించి చేస్తేనే విమర్శలు వస్తాయి. ఇప్పుడు భారత ప్రభుత్వం అదే చేస్తున్నది. దేశాధినేతల గౌరవార్థం ఇస్తున్న విందులో బంగారు(Gold), వెండి(Silver) పాత్రలను ఉపయోగిస్తుండంపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. కోట్లాది మంది ఆకలితో అలమటిస్తుంటే ఈ ఆడంబరపు ఖర్చు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది జీ 20 సదస్సుకు భారతదేశం అధ్యక్షత వహిస్తోంది. శని, ఆదివారాలలో జరిగే ఈ సమావేశాల కోసం న్యూఢిల్లీ ముస్తాబయ్యింది. అమెరికా(America), బ్రిటన్(Britain), ఫ్రాన్స్‌తో(France) పాటు 30 దేశాల అగ్ర నేతలు, వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు. వీరికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి విందు ఇస్తున్నారు. ప్రత్యేకంగా తయారు చేయించిన బంగారు, వెండి పాత్రలలో వడ్డించబోతున్నారు. దీనిపైనే చాలా మంది తిట్టిపోస్తున్నారు. జీ 20 దేశాల సమక్షంలో సంపదను ప్రదర్శించడం కోసం ప్రజాధనాన్ని విపరీతంగా ఖర్చు చేయడం ఘోరమని, సిగ్గు చేటని మండిపడుతున్నారు. పైపైన కనిపించే ఇలాంటి అహంకారపూరిత ప్రద్శనలను నిరుత్సాహపరచాలన్నారు.'జనాభాలో 80 శాతం మంది ఉచిత రేషన్‌ సరుకులపై ఆధారపడే ప్రజలు ఉన్న దేశంలో, మురికివాడలు కనిపించకుండా ఆకుపచ్చటి బట్టలతో కప్పివేస్తున్న దేశంలో, విదేశీ ప్రతినిధులకు బంగారు పూత పూయబడిన పాత్రల్లో తింటారు. ప్రజాధనాన్ని నిసిగ్గుగా ఖర్చు చేస్తున్నారు. 21 శతాబ్దపు నీరోలు' అని కొందరు విమర్శిస్తున్నారు. 'మనం చెల్లిస్తున్న పన్నులను ప్రధాని మోదీ ఇలాఖర్చు చేస్తున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీదైన కానుకలు, విందులతో విదేశీ ప్రతినిధులను ఆకర్షించాలని ప్రధాని అనుకుంటున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

Updated On 8 Sep 2023 8:17 AM GMT
Ehatv

Ehatv

Next Story